Social News XYZ     

Telugu Movie Dubbing Artist Union (TMDAU) silver jubilee celebrations held in style

Telugu Movie Dubbing Artist Union (TMDAU) silver jubilee celebrations held in style

తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ (టి ఎమ్ డి ఎ యు) 25సంవత్సరాల రజతోత్సవ ఉత్సవాలు అన్నపూర్ణ 7 ఎకరాలలో అతిరధ మహారధుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగాయి . ఈ 25సంవత్సరాల పండుగను ప్రతి నెల నెలా యూనియన్ సభ్యులు జరుపుకుంటూ ముంగిపు వేడుకలను అన్నపూర్ణ 7 ఎకరాలలో నిర్వహించారు .

ఎల్. వి . ప్రసాద్ సంస్థల అధినేత శ్రీ రమేష్ ప్రసాద్ , సురేష్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సురేష్ బాబు , మల్లెమాల అధినేత శ్రీ శ్యాం ప్రసాద్ రెడ్డి , శ్రీ దిల్ రాజు , జూబ్లీ హిల్స్ ఎమ్ఎల్ఎ  శ్రీ మాగంటి గోపినాథ్ , నిర్మాత శ్రీ కళ్యాణ్ , పరుచూరి బ్రదర్స్ , శ్రీ తనికెళ్ళ భరణి , యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీ రాజేంద్రప్రసాద్ ,శ్రీ తులసి ,శ్రీ రోజా రమణి ,శ్రీ పృథ్వి , శ్రీ బ్రహ్మాజీ , శ్రీ సుమ , శ్రీ అలీ మరియు యూనియన్ ప్రెసిడెంట్ పప్పు మరియు కార్య వర్గ సభ్యులు (కాంచన బాబు (సెక్రటరీ ),చంద్రిక ,దామోదర్ రెడ్డి,సాయి రాజ్ ,హరిత ,అచ్యుత్ ,సురేష్ , లలితారాజ్ ,రాధాకృష్ణ ) జోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు . ఆ తరువాత యాంకర్ సుమ ,అలీ ల యాంకరింగ్ లతో ఎన్నో కల్చరల్ పోగ్రామ్స్ నిర్వహించారు .

 

చెన్నై నుంచి హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమను తీసుకురావడంలో కృషిచేసిన ఎందరో మహానుభావులను గుర్తు చేసుకుంటూ డబ్బింగ్ లతో ఎంతో మంది ఆర్టిస్టులకు ప్రాణ ప్రతిష్ట చేసిన సీనియర్ డబ్బింగ్ కళాకారులకు అవార్డులు అందజేసి వారిని సత్కరించారు .

* ముఖ్యంగా ఎల్. వి .ప్రసాద్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్  అవార్డును శ్రీ రమేష్ ప్రసాద్ గారి చేతుల మీదుగా డా. రాజేంద్రప్రసాద్ గారికి , శ్రీ బాలసుబ్రమణ్యంగారికి అందజేశారు .

*  ఎన్టీఆర్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును  శ్రీ కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా శ్రీమతి సరితా గారికి అందజేశారు .

*  ఏఎన్ఆర్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును  శ్రీ శేఖర్ కమ్ముల , నవదీప్ గార్ల చేతుల మీదుగా శ్రీ జయ భాస్కర్ , శ్రీ రమణా రెడ్డి గారికి అందజేశారు .

*  డి . రామానాయుడు లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును  శ్రీ సురేష్ బాబు చేతుల మీదుగా శ్రీ రోజా రమణి గారికి అందజేశారు .

*  అల్లు రామలింగయ్య లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును  శ్రీ సి . కళ్యాణ్ గారి చేతుల మీదుగా శ్రీ రవిశంకర్ గారికి శ్రీమతి సునీత గారికి అందజేశారు .

*  ఎమ్.ఎస్.రెడ్డి లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును  శ్రీ శ్యాం ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ శిల్పగారికి అందజేశారు .

*  వి . బి.రాజేంద్ర ప్రసాద్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును  శ్రీ నాని , శ్రీ కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా శ్రీ ఘంటశాల రత్నకుమార్ గారికి అందజేశారు .

*  డా .దాసరి నారాయణ రావు లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును  శ్రీ విష్ణు , శ్రీ నరేష్ గార్ల చేతుల మీదుగా శ్రీ వాయు పుత్ర నాగార్జున ,శ్రీ శ్రీనివాస మూర్తి గారికి అందజేశారు .

  • శ్రీ శ్రీ , ఆరుద్ర గార్ల లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డును శ్రీ శ్రీను వైట్ల ,శ్రీ గౌతం రాజులు (ఎడిటర్) శ్రీ వెన్నలకంటి , శ్రీ రామకృష్ణ గార్లకు అందజేశారు .

అలాగే యూనియన్ స్థాపించిన దగ్గర నుండి ఈ 25 సంవత్సరాలు యూనియన్ పురోగతికి కమిటీలలో వారి వంతు సేవలందించిన  ఫౌండర్లు , సీనీయర్ సభ్యులైన ప్రసాద్ గారికి , శ్రీ కాంచన బాబు , శ్రీ బి. వి సుబ్బారావు గారికి , శ్రీ మనోహర్ గారికి ,శ్రీ చంద్రిక గారికి , శ్రీ కాదంబరి కిరణ్ , శ్రీ కిశోర్ , శ్రీ మంగరాజు ,శ్రీ రత్న సాగర్ , శ్రీ నాగమణి ,శ్రీ అనురాధ , శ్రీ ఝాన్సీ , శ్రీ రాంబాబు శ్రీ ఆర్. సి. యమ్ రాజు , శ్రీ దామోదర్ , శ్రీ శ్రీనివాస్ , శ్రీ సుభానీ , శ్రీ రఘు కుంచె , శ్రీ రమ శ్రీ , శ్రీ ఆజాద్ , శ్రీ మల్లాది గార్లకు యూనియన్ మెమొంటోలతో అతిరథమహారథుల చేతుల మీదుగా సత్కరించుకుంది.

అలానే సౌమ్య ,హరిత , ప్రియాంక , చిన్మయి , వాసు ,ఆర్. సి. యమ్ , అజీజ్ , మురళి , లిప్సిక ,శ్రీ వల్లి , జ్యోతి , విజయ మాధవి , క్రాంతి , అంజలి ,భవాని ,గాయత్రి ,కాజల్ , మహతి లను బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మొమెంటోలతో టి ఎమ్ డి ఎ యు సత్కరించుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు గారి రాకతో 25 వసంతాల డబ్బింగ్ యూనియన్ పండుగ వాతావరణంలో కనుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది . ప్రస్తుత ప్రెసిడెంట్ పప్పు మరియు కార్యవర్గాన్ని అయన అభినందించారు. షీల్డులతో సత్కరించి డబ్బింగ్ యొక్క గొప్పతనాన్ని వారి యొక్క ప్రతిభను కొనియాడారు .

వచ్చిన అతిరథమహారథులందరు టి ఎమ్ డి ఎ యు ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుతున్న పప్పుని మరియు కార్యవర్గాన్ని అభినందిస్తూ డబ్బింగ్ ఆర్టిస్టుల యొక్క గొప్పతనాన్ని వారి వారి మాటలతో ఆకాశానికెత్తారు. సినిమాల విజయాలతో వీరి సేవలని, డబ్బింగ్ కళాకారులయొక్క ప్రాధాన్యతను, గొప్పతనాన్ని చెప్పి ఇలాంటి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించిన యూనియన్ సభ్యులను, ప్రెసిడెంట్ పప్పు ని ప్రశంశలతో అభినందించారు . గౌరవ సభ్యులు డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నేను హీరో అవ్వడానికి కారణం డబ్బింగ్, నాకు ఫుడ్ పెట్టింది డబ్బింగ్, డబ్బింగ్ లేకపోతే ఈ రాజేంద్ర ప్రసాద్ లేదు అని చెప్పారు .

ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, నాచురల్ స్టార్ నాని, కళ్యాణ్ రామ్, మంచు విష్ణు, హీరో నరేష్, హీరోలు శ్రీకాంత్, నవదీప్, తరుణ్, రాజేంద్ర ప్రసాద్, మా ప్రెసిడెంట్ శివాజీ రాజా, దర్శకులు వంశీ పైడిపల్లి, శేఖర్ కమ్ముల, రాం ప్రసాద్, బాబీ(ఫెడరేషన్ సెక్రెటరి ), అంభి రాజు, బ్రహ్మజీ, రాజీవ్ కనకాల, సుబ్బరాజు, ప్రభాస్ శ్రీను, కారుమంచి రఘు, సింహ, మల్కాపురం శివ, ముప్పలనేని శివ, రవి కుమార్ చౌదరి, రోహిణి, అలీ, రవి శంకర్, కాశీ విశ్వనాథ్, సునీత, సరిత, రోజా రమణి, ఇంకా ఎందరో అతిరథులు పాల్గొన్నారు. కన్నుల పండుగగా టి ఎమ్ డి ఎ యు ఉత్సవాలు ముగిశాయి .

Facebook Comments
Telugu Movie Dubbing Artist Union (TMDAU) silver jubilee celebrations held in style

About uma

%d bloggers like this: