Social News XYZ     

Twists In Cab Stories Movie Will Entertain Audience Through Out: Divi Vadthya

అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్యాబ్‌ స్టోరీస్‌’లోని ట్విస్టులకు ఆడియన్స్ థ్రిల్ అవుతారు – దివి

బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి, గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహన్‌ ప్రధాన పాత్రల్లో కేవీఎన్‌ రాజేష్‌ దర్శకత్వంలో ఎస్‌ కృష్ణ నిర్మించిన ‘క్యాబ్‌ స్టోరీస్‌’ ఈ నెల 28న స్పార్క్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘క్యాబ్‌ స్టోరీస్‌’ లీడ్‌ క్యారెక్టర్‌ చేసిన దివి చెప్పిన విశేషాలు...

‘క్యాబ్‌స్టోరీస్‌’ లో నటించే అవకాశం ఎలా వచ్చింది?
- మహేశ్‌బాబుగారి ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్న సమయంలో ‘క్యాబ్‌స్టోరీస్‌’లో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ షో చేశాను.

 

‘క్యాబ్‌స్టోరీస్‌’ కథ గురించి ఏం చెబుతారు?
- ఇందులో నా క్యారెక్టర్‌ పేరు షాలిని. తను సాప్ట్‌వేర్‌ ఎంప్లాయి. నేను క్యాబ్‌ ఎక్కే క్రమంలో ఓ చిన్న మిస్టేక్‌ జరుగుతుంది. నా మిస్టేక్‌ వల్ల కథలోని మిగతా పాత్రలు ఎలా ప్రభావితం అయ్యాయి అన్న అంశం సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. షాలిని క్యారెక్టర్‌ చాలెంజింగ్‌గా కాదు. ఫన్‌లా అనిపించింది. కథలోని ఊహించిన మలుపులు ఆడియన్స్‌కు ఆశ్చర్యపరుస్తాయి. నైట్‌ షూట్స్‌ చేశాం. దర్శకుడు రాజేష్‌ చాలా హెల్ప్‌ చేశారు. చాలా క్లారిటీ ఉన్న దర్శకులు రాజేష్‌. సీన్‌ను ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు చెప్పేశారు. చాలా సహనంగా ఉంటారు. డైరెక్టర్‌ కాన్ఫిడెంట్‌గా ఉంటే సెట్‌లో వాతావరణం బాగా ఉంటుంది. డైరెక్టర్‌ నాకు కథను చెప్పినట్లే తీశారు. థియేటర్స్‌లో విడుదల అయితే బాగుంటుందని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్‌ చేయకతప్పదు. సాయి కార్తీక్‌ మంచి సంగీతం అందించారు. నా కో యాక్టర్స్‌ ప్రవీణ్, సిరి, గిరిధర్, శ్రీహాసన్‌ బాగా హెల్ప్‌ చేశారు.

లాక్‌డౌన్‌ మీ కెరీర్‌పై ప్రభావం చూపిందని మీరు అనుకుంటున్నారా?
- ఎవరైనా సంతోషంగా ఉంటేనే సినిమాలు చూస్తారు. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. త్వరలో అందరం ఈ పరిస్థితుల నుంచి బయటపడతాం అనే నమ్మకం ఉంది. కెరీర్‌ మంచి గాడిలో పడుతున్న సమయంలో ఇలాంటి ఓ బ్రేక్‌ రావడం దురదృష్టంగా భావిస్తున్నాను. నాకే కాదు. చాలామంది ఆర్టిస్టులకు ఇబ్బందిపడుతున్నారు.

బిగ్‌బాస్‌ షోకు ముందు మీ జీవితం ఎలా ఉంది? బిగ్‌బాస్‌ షో తర్వాత ఎలా ఉంది?
- బిగ్‌బాస్‌ తర్వాత లైఫ్‌ కాస్త ఈజీగా ఉంది. గుర్తింపు లభించింది. అవకాశాలు పెరిగాయి. ఇంతకుముందులా రిజెక్షన్స్‌ తక్కువ. కథలోని తమ పాత్రకు నేను సరిపోతామని చాలామంది దర్శకులు సంప్రదిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. బిగ్‌బాస్‌ తర్వాత నా గురించి చాలామందికి తెలిసింది. బిగ్‌బాస్‌ షో తర్వాత నేను ఎక్కడికి వెళ్లిన కొంతమంది వచ్చిన షోలో నేను బాగా ఆడానని ప్రశంసిస్తున్నారు. నాకు ఇది పెద్ద సక్సెస్‌గా అనిపించింది. దీవి చాలా స్ట్రయిట్‌ ఫార్వెర్డ్, అబద్దాలు చెప్పదు అని అందరికి తెలిసింది. నాగార్జున గారు నాకు బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ అనే ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. దీన్ని నేను ఒక అచీవ్‌మెంట్‌లా ఫీల్‌ అవుతున్నాను. షోకు వెళ్లడానకి ముందు నేను కాస్త కంగారు పడ్డాను. ఇన్‌సెక్యూరిటీ ఫీల్‌ అయ్యాను. నాకు తెలియకుండానే నేను ఇతరులను బాధపెడతానెమో? అని ఆలోచించాను. కానీ షోలో నేను బాగా ఆడానని ఎక్కువమంది వ్యూయర్స్‌ చెప్పారు. చాలా హ్యాపీ ఫీలయ్యాను. చెప్పాలంటే నేను నా ఎపిసోడ్స్‌ ఇంతవరకు చూడలేదు.

బిగ్‌బాస్‌ షో తర్వాత మీ జీవితంలో మీరు గమనించిన మార్పులు ఏంటీ?
- స్నేహితులు, బంధువులతో పాటు కొంతమంది నేను సినిమాలకు ప్రయత్నిస్తున్నప్పుడు నిరుత్సాహంగా మాట్లాడారు. మరికొందరు జోక్స్‌ వేశారు. కానీ ఇప్పుడు అలా లేదు. వారిలో మార్పు వచ్చింది. వారు కూడా ప్రొత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది పాపులర్‌ ఫీల్డ్‌. అందుకే నేను ఉద్యోగం చేయాలనుకోవడం లేదు. జీవితంలో ఎత్తుపల్లాలు ఎలా ఉంటాయో, నా కెరీర్‌లో కూడా అలానే ఉంటాయని గ్రహించాను. సినిమా హిట్‌ కావొచ్చు. ఫ్లాప్‌ కావొచ్చు. మన ప్రయత్నంలో లోపం ఉండ కూడదు. మన కష్టంలో నిర్లక్ష్యానికి చోటు ఇవ్వకూడదు.

ఒక నటిగా మీరు ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
- స్ట్రాంగ్‌ ఉమెన్‌ క్యారెక్టర్స్‌ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి కథలు చేయడానికి ఆసక్తికరంగా ఉన్నాను. లక్కీగా ఇలాంటి కథలే నాకు వస్తున్నాయి. రొమాంటిక్‌ కథలు కూడా వస్తున్నాయి. అయితే కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలనే చేయాలనుకుంటున్నాను.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌?
- చిరంజీవిగారు హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో ఒక కీ రోల్‌ చేయనున్నాను. దర్శకులు నాకు కథ చెప్పారు. ఆ త‌ర్వాత ‘లంబసింగి’షూటింగ్‌ను పూర్తి చేశాను. ఘర్షణ అనే వెబ్‌సిరీస్‌లో ఒక లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. వీటితో పాటు మరికొన్ని కథలు చర్చల దశల్లో ఉన్నాయి. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాను.

Facebook Comments
Twists In Cab Stories Movie Will Entertain Audience Through Out: Divi Vadthya

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

PHP Code Snippets Powered By : XYZScripts.com
%d bloggers like this: