Social News XYZ     

Ram to work with Appatlo Okadundevadu movie director Sagar Chandra

రామ్ మరో సినిమా చెయ్యబోతున్నాడు !.

Ram to work with Appatlo Okadundevadu movie director Sagar Chandra

అయ్యరే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్ర దర్శకుడు సాగర్ చంద్ర వరుణ్ తేజ్ తో 14 రీల్స్ బ్యానర్ లో సినిమా చెయ్యాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చెయ్యడంలేదు. తాజా సమాచారం మేరకు ఆ స్థానంలో రామ్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్న రామ్ ఈ సినిమా తరువాత సాగర్ చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు స్రవంతి రవికిషోర్ నిర్మించబోతున్నాడు.

 

అయితే సాగర్ చంద్ర వరుణ్ తేజ్ కు చెప్పిన కథ వేరే, రామ్ కు చెప్పిన కథ వేరేనని సమాచారం. రామ్ నటించిన సినిమాలు ఈ మధ్య పెద్దగా సక్సెస్ కాలేదు. పూరితనకు హిట్ ఇస్తాడని నమ్మకంతో ఉన్నాడు రామ్. సాగర్ చంద్ర సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది.

Facebook Comments

Advertisements
%d bloggers like this: