Social News XYZ     

Vaishakham music director DJ Vasanth interview

'వైశాఖం' ఈ సంవత్సరం నా బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తున్నాను
- సంగీత దర్శకుడు డి.జె.వసంత్‌

Vaishakham music director DJ Vasanth interview

అద్భుతమైన మెలోడీ సాంగ్స్‌ చెయ్యడంలో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌ సత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మనవడిగా సంగీత వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సంగీత దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకొని వీనుల విందైన పాటల్ని అందిస్తున్నారు డి.జె.వసంత్‌. ఎంతో మంది ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పనిచేసి మంచి అనుభవాన్ని సంపాదించుకున్న డి.జె.వసంత్‌ 'మడత కాజా' చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచమయ్యారు. 'సుడిగాడు' చిత్రంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. 'స్పీడున్నోడు' చిత్రంతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న
'వైశాఖం' చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సంవత్సరం ఆరు సినిమాలు చేస్తూ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా బిజీ అయిపోయిన డి.జె.వసంత్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 1. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో విలేకరులతో సమావేశమయ్యారు డి.జె.వసంత్‌.

ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమిటి?
- ఈ పుట్టినరోజుకి నేను చాలా సంతోషంగా వున్నాను. అదే ప్రత్యేకత. సంతోషం ఎందుకంటే నేను చాలా బిజీగా వున్నాను. ఈ సంవత్సరం చాలా సినిమాలు చేస్తున్నాను. ఆ సంతోషాన్ని పాత్రికేయులతో పంచుకోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం నా పుట్టినరోజు కానుకగా వస్తున్న సినిమా 'వైశాఖం'. జయ మేడమ్‌గారి డైరెక్షన్‌లో బి.ఎ.రాజుగారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని పాటలూ బాగా వచ్చాయి. సాధారణంగా ఒక సినిమాలో రెండు, మూడు పాటలు బాగుంటాయి. కానీ, ఈ సినిమాలో మాత్రం అన్ని పాటలూ బాగా వచ్చాయి. ఈ పాటలు బాగా రావడానికి డైరెక్టర్‌ జయగారే కారణం. నాతో మంచి పాటలు చేయించారు. ఆడియో ఖచ్ఛితంగా పెద్ద హిట్‌ అవుతుంది. ఈ ఆడియో నాకు, నా కెరీర్‌కి తప్పకుండా ఉపయోగపడుతుంది.

 

ఇండస్ట్రీకి వచ్చి ఎంత కాలమైంది? మీకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?
- నేను ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలు పూర్తయింది. తాతగారి ఇన్‌స్పిరేషన్‌తోనే ఇండస్ట్రీకి వచ్చాను. పెద్ద పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అందరి దగ్గర అసిస్టెంట్‌గా, కంపోజింగ్‌ అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాను. స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలకు పాటలు కూడా రాశాను. శ్రీగారు, మణిశర్మగారు, హేరిస్‌ జైరాజ్‌గారు, ఆర్‌.పి.పట్నాయక్‌గారి దగ్గర పనిచేశాను.

సత్యంగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?
- ఏ సినిమా వచ్చినా మ్యాగ్జిమమ్‌ ఎఫర్ట్‌ పెట్టాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది అది రిలీజ్‌ అయ్యే వరకు ఎవరూ చెప్పలేరు. ఈ విషయం ఆయన దగ్గర నేర్చుకున్నాను. తాతగారి డోలక్‌ బీట్‌ అంటే నాకు చాలా ఇష్టం. మెలోడీ పాట చేసినా అందులో బీట్‌ వుండాలని ఆయన కోరుకునేవారు. నేను కూడా అది కంటిన్యూ చెయ్యడానికి ట్రై చేస్తున్నాను.

చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత..మీకు ఎవరు కంఫర్ట్‌ అనిపిస్తారు?
- చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అంటూ ప్రత్యేకంగా ఏమీ వుండదు. నిర్మాత అంటే నిర్మాతే. ఏ బడ్జెట్‌లో అయినా క్వాలిటీ తగ్గకుండా ఔట్‌పుట్‌ ఇవ్వొచ్చు అనేది నా నమ్మకం. నేను చేస్తున్న సినిమాలు బడ్జెట్‌లో ఎక్కువ తక్కువలు వున్నా క్వాలిటీని మాత్రం మెయిన్‌టెయిన్‌ చేస్తుంటాను. కాబట్టి నిర్మాత ఎవరైనా నా ఎఫర్ట్‌లో ఎలాంటి మార్పూ వుండదు.

మెలోడీ, బీట్‌.. ఈ రెండింటిలో మీరు దేనికి ఇంపార్టెన్స్‌ ఇస్తారు?
- మెలోడీ, బీట్‌ కంటే నేను కథకి, డైరెక్టర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తాను. డైరెక్టర్‌ ఏది అడిగితే అది ఇవ్వడానికి మ్యాగ్జిమమ్‌ ట్రై చేస్తాను. నా ఫీలింగ్స్‌ సినిమా మీద రుద్దడానికి ట్రై చెయ్యను. నిర్మాత విషయానికి వస్తే ఎంత బడ్జెట్‌ ఇచ్చినా, ఇ బడ్జెట్‌కి, క్వాలిటీకి లింక్‌ పెట్టకుండా క్వాలిటీగా చెయ్యడానికే ట్రై చేస్తాను.

'వైశాఖం' పాటలు ఎలా వచ్చాయి?
- 'వైశాఖం' ఆడియో నా పుట్టినరోజు కానుక అని అంత కాన్ఫిడెన్స్‌గా ఎలా చెప్పగలుగుతున్నానంటే అన్ని పాటలూ బాగా వచ్చాయి. ఏ పాట కూడా బాగా రాలేదు అని చెప్పడానికి లేదు. జయ మేడమ్‌ నాకు ఇచ్చిన ఫ్రీడమ్‌ వల్లే ఇంత మంచి ఆడియో చెయ్యగలిగాను. అలాగే ఈ సినిమాలోని మూడు పాటలు చూశాను కూడా. చూసిన తర్వాత ఈ ఆడియో మీద నాకు కాన్ఫిడెన్స్‌ మరింత పెరిగింది. మనం పాటని ఎంత బాగా చేస్తామో దాన్ని ప్రేమించి తీసే డైరెక్టర్‌ కూడా దొరకాలి. మేడమ్‌గారు ఈ పాటల్ని ఎంతో ప్రేమించి తీశారు. దానికి నిర్మాత బి.ఎ.రాజుగారి సపోర్ట్‌ ఎంతో వుంది. ఏ సినిమాకైనా మొదట ప్రొడ్యూసర్‌. ఆ తర్వాతే ఎవరైనా. 'వైశాఖం' చిత్రాన్ని ఒక చిన్న సినిమాగా స్టార్ట్‌ చేశారు. కానీ, ఇప్పుడది చాలా పెద్ద సినిమా అయింది. డెఫినెట్‌గా ఈ సినిమా కెరీర్‌కి చాలా హెల్ప్‌ అవుతుంది.

డైరెక్టర్‌ జయగారు ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌ హిట్సే. ఈ సినిమాకి కూడా సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఇవ్వడానికి ఎలాంటి స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారు?
- మేడమ్‌గారు ఇంతకుముందు చేసిన ప్రేమలో పావని కళ్యాణ్‌, చంటిగాడు మ్యూజికల్‌ హిట్స్‌. రీసెంట్‌గా వచ్చిన లవ్‌లీ సినిమా పెద్ద హిట్‌, ఆడియో కూడా పెద్ద హిట్‌. ఆ సినిమా తర్వాత చేసే సినిమాకి మేడమ్‌గారు నన్ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంచుకోవడం నా అదృష్టం. ఇంతకుముందు నేను చేసిన సినిమాల కంటే 'వైశాఖం'కి చాలా మంచి మ్యూజిక్‌ చేశావు. నేను చాలా హ్యాపీ అని మేడమ్‌గారు అన్నారు. ఆ ఒక్క మాట చాలు నాకు.

'వైశాఖం'లో ఏ పాట బాగా హైలైట్‌ అవుతుంది?
- ఇందులో అన్ని పాటలు చాలా బాగుంటాయి. జనరల్‌గా ఎన్ని పాటలు చేసినా మెలోడీ మీద ప్రేమ వుంటుంది. ఇందులోని రెండు మెలోడీ పాటలు సూపర్‌గా వచ్చాయి. వాటిని చాలా అద్భుతంగా తీశారు కూడా. జనరల్‌గా మనం చూసే లొకేషన్స్‌ మాత్రం నేను చూసిన మూడు పాటల్లో లేవు. అన్ని లొకేషన్స్‌ చాలా ఫ్రెష్‌గా వుంటాయి.

అపార్ట్‌మెంట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన '7జి బృందావన కాలని' మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అయింది. మరి 'వైశాఖం' మ్యూజిక్‌ ఎలా వుండబోతోంది?
- వేరే సినిమాతో నేను కంపేర్‌ చేసుకోను. ఎందుకంటే ఆ ఆడియో దీనికంటే బాగుండొచ్చు. దానికంటే ఈ ఆడియో బాగుండొచ్చు. నేను మ్యాగ్జిమమ్‌ మంచి మ్యూజిక్‌ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన కథే అయినా దీనికి, 7జి బృందావన కాలనీకి ఎలాంటి సంబంధం వుండదు. ఇది డిఫరెంట్‌ జోనర్‌. లవ్‌స్టోరీతోపాటు ఒక మంచి మెసేజ్‌ వున్న సినిమా ఇది. ఎలాగోలా బ్రతికేద్దాం అని కాదు, జనానికి ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేసే సినిమా. డెఫినెట్‌గా మేడమ్‌ అందులో సక్సెస్‌ అవుతారు, మమ్మల్నందర్నీ సక్సెస్‌ చేస్తారు.

ఈ సంవత్సరం చేస్తున్న సినిమాలు ఏ జోనర్స్‌లో వుంటాయి?
- అన్నీ డిఫరెంట్‌ జోనర్స్‌లో వుండే సినిమాలే. 'వైశాఖం' ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ విత్‌ మెసేజ్‌. నరేష్‌తో చేస్తున్న సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ వున్న మూవీ. మనోజ్‌గారితో చేసే సినిమా ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌ మూవీ. ఈ సంవత్సరం అన్ని జోనర్స్‌ టచ్‌ చేయడం హ్యాపీగా వుంది. అందుకే కాస్త ఎగ్జయిటింగ్‌గా వుంది.

మీరు ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలైంది. మీ కెరీర్‌లో ఈ సంవత్సరానికే ఎక్కువ ఇంపార్టెన్స్‌ వుందంటారా?
- నిజానికి నేను ఎక్కువ సినిమాలు చెయ్యను. సుడిగాడు పెద్ద హిట్‌ అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా నాకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ, స్లోగా ఒక్కో సినిమా చేద్దాం అనుకునే మనస్తత్వం నాది. కానీ, స్పీడున్నోడు రిలీజ్‌ తర్వాత స్పీడ్‌ పెంచాలనిపించింది. ఆటోమేటిక్‌గా స్పీడ్‌ పెరిగింది. అది దేవుడిచ్చిన గిఫ్ట్‌గా ఫీల్‌ అవుతున్నాను.

సినిమాలు కాకుండా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వేరే ప్లాన్స్‌ ఏమైనా వున్నాయా?
- సినిమాలు కాకుండా నాకు సెపరేట్‌ ప్లాన్స్‌, డ్రీమ్స్‌ ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్‌ తప్ప ఏమీ తెలీదు. సినిమా ఇండస్ట్రీలో కూడా మ్యూజిక్‌ తప్ప వేరే క్రాఫ్ట్‌ నాకు తెలీదు. మ్యూజిక్‌ చేస్తాను, అప్పడప్పుడు లిరిక్స్‌ రాస్తాను. పది సంవత్సరాల క్రితం 'కోయిలమ్మ' అనే ఆల్బమ్‌ రాశాను. మళ్ళీ 'వైశాఖం'తో నన్ను రైటర్‌గా రీ ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు మేడమ్‌గారు. ఆ పాట చాలా బాగా వచ్చింది. మగాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. ఆడాళ్ళందరూ బాగా తిడతారనుకుంటున్నాను.

కొత్త సింగర్స్‌ని ఎంకరేజ్‌ చేస్తున్నారా?
- నేను సినిమాల్లో మ్యాగ్జిమమ్‌ ఇక్కడి సింగర్సే వుంటారు. నాకు తెలుగు సింగర్స్‌ అంటే చాలా ఇష్టం. స్పీడున్నోడు లాంటి పెద్ద బడ్జెట్‌ సినిమాలో సింగర్స్‌కి లక్షలైనా అయినా పెడతాం అన్నప్పుడు కూడా ప్రొడ్యూసర్‌ని, డైరెక్టర్‌ని కన్విన్స్‌ చేసి ఇక్కడి సింగర్స్‌తోనే పాడించడానికి ట్రై చేశాను. మన పాట మనవాళ్ళ నోటి నుంచి వస్తేనే బాగుంటుంది. వేరే భాష సింగర్స్‌ పాడితే ఎంత ప్లస్‌ అవుతుందో తెలీదుగానీ భాషకి మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. బాహుబలిలో ఓ పాట పాడిన అమ్మాయితో వైశాఖంలో పాట పాడించాం. మీకు ఎవరు కంఫర్ట్‌ అనిపిస్తే వారితోనే పాడిద్దాం అని మేడమ్‌ కూడా అన్నారు. ఈ సినిమా వరకు ప్రొడక్షన్‌ సైడ్‌ నుంచి డైరెక్టర్‌గారి నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లమ్‌ లేదు. ప్రస్తుతం నాకు ఎవైటింగ్‌ మూవీ వైశాఖం. ఇప్పటి వరకు నేను చేసిన జోనర్స్‌ వేరు, ఈ సినిమా వేరు. ఇలాంటి ఫీల్‌గుడ్‌ మూవీ ఇంతవరకు చెయ్యలేదు. ఈ జోనర్‌ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్‌ జయ మేడమ్‌కి థాంక్స్‌

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?
- ఈ సినిమా తర్వాత మంచు మనోజ్‌ హీరోగా సత్య డైరెక్షన్‌లో వరుణ్‌ నిర్మిస్తున్న సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్నాను. అల్లరి నరేష్‌గారు నాకు బాగా అచ్చొచ్చిన హీరో. ఆయనతో నేను చేసిన సుడిగాడు ఆడియో మంచి హిట్‌ అయింది. అది రీమేక్‌ సినిమా. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు నరేష్‌గారితో 'వరువడక్కన్‌ సెల్ఫీ' అనే మలయాళ సినిమా రీమేక్‌ చేస్తున్నాను. ఈ రీమేక్‌ సెంటిమెంట్‌తో సుడిగాడు చిత్రాన్ని మించిన హిట్‌ కొడతానన్న కాన్ఫిడెన్స్‌ నాకు వుంది. అలాగే ఇ.సత్తిబాబుగారి డైరెక్షన్‌లో కె.కె.రాధామోహన్‌గారు నిర్మించే సినిమా చేస్తున్నాను. ఇలా మరో మూడు సినిమాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం ఆల్రెడీ ఆరు సినిమాలు రన్నింగ్‌లో వున్నాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ డి.జె.వసంత్‌.

Facebook Comments

%d bloggers like this: