Social News XYZ     

Rudra Simha Movie Audio Function Held

సినీ అథిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకున్న రుద్ర సింహ" ఆడియో వేడుక

KM ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్. స్నేహ, మైత్రి, హీరో, హీరోయిన్లు గా మనోహర్ కాటేపోగు దర్శకత్వంలో మనోహర్ కాటేపోగు, ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్ రావు జింకల లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న యాక్షన్, రివేంజ్ డ్రామా చిత్రం "రుద్ర సింహ".ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైన సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో "రుద్ర సింహ" ఆడియోను విడుదల చేయడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీనియర్ నటుడు సుమన్, బాను చందర్ లు ఆడియోను విడుదల చేయగా నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ,దర్శకుడు సముద్ర, సాయివెంకట్,దర్శకుడు రవి కుమార్ చౌదరి,నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, శోభారాణి , లయన్స్ క్లబ్ చైర్మన్ కోటేశ్వరరావు, దొరై రాజు,నటులు దాసన్న, చలపతిరాజు తదితరులు పాల్గొని చిత్రంలోని పాటలను విడుదల చేశారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో

నటుడు సుమన్ మాట్లాడుతూ.. దర్శకుడు మనోహర్ ఈ సినిమాకు మాటలు, పాటలు,కథ, స్క్రీన్ ప్లే,డైరెక్షన్ ఇలా ఇన్ని బాధ్యతలు తీసుకొని "రుద్ర సింహ" సినిమా చేయడం చాలా మంచి విషయం మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

 

నటుడు బానుచందర్ మాట్లాడుతూ... ఈ సినిమా ట్రైలర్ పాటలు చాలా బాగున్నాయి. మనోహర్ మంచి ట్యాలెంట్ ఉన్న దర్శకుడు.ఈ సినిమాకు అన్ని పాటలు, మాటలు, కథ తనే రాసుకొని సినిమా చేస్తుంటే నాకు దర్శకుడు కోడిరామకృష్ణ గుర్తుకువస్తున్నాడు. సినీ ఇండస్ట్రీ కు చిన్న సినిమాలు వస్తేనే ఇండస్ట్రీ కలకళ లాడుతుంది. ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

సీనియర్ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో తీసిన "రుద్ర సింహ" ట్రైలర్ పాటలు చాలా బాగున్నాయి. చిన్న సినిమాలు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని నమ్మే సుమన్ గారు షూటింగ్ ఉన్నా చిన్న సినిమా ఫంక్షన్ కు వచ్చి అండగా నిలబడుతూ అట్టి నిర్మాతలకు సపోర్ట్ గా నిలుస్తూ ఆశీర్వదించడం గొప్ప విషయం. సుమన్, భానుచందర్ లిద్దరూ మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు.వీరిద్దరూ మంచి మనసుతో ఆశీర్వాదించిన ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

చిత్ర దర్శకుడు మనోహర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నాకిష్టమైన సీనియర్ దర్శకులు సముద్ర గారు, నా అభిమాన నటులు సుమన్, బానుచందర్ లు వచ్చి మా చిత్ర ఆడియో ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా లో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు ఇందులో ఏడు పాటలు, ఐదు ఫైట్స్ ఉన్నాయి. యాక్షన్ ,రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ కూడా కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఎంతో థ్రిల్ ఫీల్ అవుతారు.ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

చిత్ర నిర్మాత బింగి దర్గయ్య మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీశాము. మేము అనుకున్న దానికంటే సినిమా చాలా బాగా వచ్చింది.యాక్షన్ ,రివెంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ నెల 8 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

మరో నిర్మాత ఆంజనేయులు మాట్లాడుతూ.. KM ఫిల్మ్ బ్యానర్ లో మేము తీసిన "రుద్ర సింహ" సినిమాను రాయలసీమ లోని అడవులలో చిత్రీకరించడం జరిగింది. యాక్షన్ ,రివెంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాను దర్శకుడు మనోహర్ చాలా చక్కని సినిమా తీశాడు. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాను ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

మరో చిత్ర నిర్మాత కోటేశ్వర్ రావు లు మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు.లవ్, యాక్షన్, సెంటిమెంట్ తో కూడిన కంటెంట్ తో ఈ నెల 8 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

హీరో సంతోష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఎంతో హార్డ్ వర్క్ చేశారు. నిర్మాతలు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు.యాక్షన్,రివెంజ్ డ్రామా వంటి మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ..సినిమా టికెట్స్ రేట్స్ పెరగడం వలన ప్రేక్షకులకు థియేటర్ కు రావడం మానేశారు. దీని వల్ల చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ టికెట్స్ రేట్స్ విషయంలో ఈ టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమా బతుకు కోరే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది.KM ఫిల్మ్ బ్యానర్ లో యాక్షన్ ,రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల తో ఈ నెల 8న వస్తున్న "రుద్ర సింహ" సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు.

నిర్మాత శోబారాణి మాట్లాడుతూ.. దర్శకుడు ఈ సినిమాలోని పాటలన్ని తనే చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాలో .నటీ, నటులు చాలా చక్కగా నటించారు. రుద్ర సింహ టైటిల్ పవర్ ఫుల్ గా ఉంది.ఈ నెల 8 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి. ఆన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ చిత్రం లోని పాటలు చాలా బాగున్నాయి. యాక్షన్ ,రివెంజ్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు

లయన్స్ సాయివెంకట్ మాట్లాడుతూ.. మనోహర్ అన్ని విభాగాలను చక్కగా హ్యాండిల్ చేశాడు.ఈ మధ్య ఓటిటి రావడంతో ప్రేక్షకులు థియేటర్ కు రావడం లేదు. వారిని థియేటర్ కు రప్పించే విధంగా మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసి అడియన్స్ ను థియేటర్స్ రప్పించే విధంగా చెయ్యాలి అన్నారు.

నటుడు దాసన్న మాట్లాడుతూ.. నటీ నటులు కొత్తవారైనా పెద్ద సినిమా తీశారు.ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

శ్రీ రంగపురం చిత్ర నిర్మాత నాగరాజు మాట్లాడుతూ.. ఇప్పుడు వస్తున్న సినిమాలకు ప్యాడింగ్ ముఖ్యం కాదు. కంటెంట్ ముఖ్యం. మంచి కంటెంట్ ఉన్న కథను నమ్మి నలుగురు నిర్మాతలు కలసి కట్టుగా ఈ సినిమా తీశారు. ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

విలన్ అభి మాట్లాడుతూ.. ఇది నా ఏడవ సినిమా. నాకిలాంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

నటుడు చలపతి రాజు మాట్లాడుతూ...అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిన "రుద్ర సింహ" సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

డి.ఓ.పి ఉదయ్ మాట్లాడుతూ.. నిర్మాతలు అందరూ నాకు మంచి ఫ్రీడమ్ ఇవ్వడంతో సినిమా బాగా చేయగలిగాను. ఈ నెల 8 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.ఆ తరువాత చిత్ర యూనిట్ అందరికీ "రుద్ర సింహ" జ్ఞాపికలు అందజేశారు

నటీనటులు
హీరో. సంతోష్ ,హీరోయిన్స్ స్నేహ, మైత్రి, నాధవరం ఆంజనేయులు, జింకల కోటేశ్వర్ రావు, బింగి ధరగయ్య, తుమ్మేటి శ్రీ హరి, జింకల రవి కుమార్, రమణి, ప్రసాద్,కృష్ణా రెడ్డి, రవికుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : KM ఫిల్మ్ ప్రొడక్షన్స్
నిర్మాతలు : ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్ రావు జింకల,మనోహర్ కాటేపోగు,
దర్శకుడు : మనోహర్ కాటేపోగు
డి. ఓ.పి : ఉదయ్ కుమార్ జి
సాహిత్యం : మనోహర్ కాటేపోగు
సంగీతం : రాజేష్ రాజ్ టి
ఎడిటర్స్ : ప్రేమ్ స్నాప్స్, మణి
రైటర్ : బ్యూలా రాణి కె
కో డైరెక్టర్ : షాలెం రాజ్ కె

Facebook Comments
Rudra Simha Movie Audio Function Held

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: