Social News XYZ     

Trivikram changed his route!

త్రివిక్రమ్ రూటు మార్చాడు!

Trivikram changed his route!

నువ్వే నువ్వే సినిమా దగ్గరనుండి మొన్న వచ్చిన ఆజ్ఞతవాసి సినిమా వరుకు త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ మెయిన్ హైలెట్ గా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో కామెడీ ఉండదని సమాచారం. సినిమా మొత్తం ఒకే ఎమోషన్ లో ఉంటుందని అంటున్నారు. రాయలసీమ చిత్తూరులో జరిగే కథగా ఈ సినిమా సాగుతోంది. మొదటినుండి చివరివరుకు ఎన్టీఆర్ రాయలసీమ భాషలో డైలాగ్స్ చెప్పబోతున్నాడని తెలుస్తోంది.

అరవింద సమేత సినిమాలో కామెడీ లేకుండా కేవలం ఎమోషన్స్ మీద సినిమా నడిపించడానికి కారణం ఏంటంటే... ఆజ్ఞతవాసి సినిమాలో కామెడీ మిస్ఫైర్ అయ్యింది. కావున ఈ సినిమాలో అలాంటి తప్పు జరగకూడదని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. జగపతి బాబు ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు. అతనే సినిమాలో మెయిన్ విలన్ అవ్వడం విశేషం. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈనెల 20న హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో జరగనుంది. అక్టోబర్ రెండోవారంలో సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 

Facebook Comments

Advertisements
%d bloggers like this: