Social News XYZ     

Anasuya Bharadwaj will be see in a village belle role again

మరోసారి పల్లెటూరు పాత్రలో అనసూయ!

Anasuya Bharadwaj will be see in a village belle role again

రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్తగా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ లేటెస్ట్ గా రెండు సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో కనిపించబోతోంది. అనసూయకు చాలా అవకాశాలు వస్తున్నా నరేషన్ నచ్చితేనే సినిమాను ఒప్పుకుంటుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్2 సినిమాలో అనసూయ ఒక పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతోంది. ఆమె పాత్ర సినిమాకు కీలకమని అంటున్నారు. రంగస్థలం సినిమా తరువాత మళ్ళీ విలేజ్ రోల్ లో కనిపించడం విశేషం.

 

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర సినిమాలో అనసూయ ఒక మెయిన్ రోల్ లో కనిపించబోతోంది. అనసూయ ఈ చిత్ర షూటింగ్ లో ఇటీవలే పాల్గొనడం జరిగింది. ఇటు జబర్దస్త్ ప్రోగ్రాం చేస్తూ.. వచ్చిన సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది అనసూయ.

ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు కాకుండా మరో అగ్ర హీరో సినిమాలో అనసూయ నటించే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. త్వరలో ఆ వివరాలు అనసూయ స్వయంగా తెలియజేయనుంది. త్వరలో ఈమె నటించిన సచ్చిందిగొర్రె సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

Facebook Comments

%d bloggers like this: