Social News XYZ     

‘Ippatlo Ramudila Seethala Evaruntarandi Babu’ movie promo is too hot

ఈ దర్శకుడు అనుకున్నంత పని చేశాడు...

'Ippatlo Ramudila Seethala Evaruntarandi Babu' movie promo is too hot

ఈ మధ్య కాలంలో దర్శకులు తాము ఏం కావాలనుకుంటున్నారో ఎలా తీయానుకుంటున్నారో అలా తీసేస్తున్నారు. లాభనష్టాల సంగతి పక్కన పెట్టి యూత్‌ను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి ప్రయత్నమే దర్శకుడు వెంకటేష్‌.కె తన చిత్రం ద్వారా చేయబోతున్నాడు. ఆయన ఇటీవల మీడియా సమావేశంలో చెప్పినట్టుగా తాను విడుదల చేయబోయే వీడియో ఖచ్చితంగా అశ్లీలంగా, ఆకర్షణీయంగా, స్పైసీగా, యూత్‌ను రెచ్చగొట్టేవిధంగా, అన్ని వర్గాల వారిని గిలిగింతలు పెట్టేదిగా ఉంటుందని చెప్పారు. తీరా ఆ వీడియో రిలీజ్ అయిన తరువాత చూస్తే అన్నంత పని చేశారు దర్శకుడు అనిపించింది. శృంగారానికి పరాకాష్టగా సెక్స్‌ అప్పీల్‌తో యూత్‌ మతి పోగొట్టేలా ఉంది ఆ వీడియో. ఇంతకీ ఆ చిత్రం పేరు చెప్పలేదు కదా! ‘ఇప్పట్లో.. రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ..!’.

 

ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్‌.కె యువకుడు కావడంతో పాటు తన అభిప్రాయాలను, అభిరుచులను దించేసిందిగా కనిపిస్తుంది. మొదట రొమాంటిక్‌ పిక్చర్స్‌తో కూడిన స్టిల్స్‌ రిలీజ్‌ చేశారు. తరువాత స్పైసీతో కూడిన పోస్ట్‌ర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇవన్నీ వెబ్‌సైట్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. యూత్‌ను ఆకర్షిస్తూ దృష్టి మరల్చుకోకుండా చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన వీడియో నే ఇలా ఉంటే రేపు సినిమా ఎంత సెక్సీగా, స్పైసీగా, రొమాంటిక్‌గా ఉండ.బోతోందన్నట్టుగా ఎదురుచూసేలా పరిస్థితి నెలకొంది. ఈ చిత్రం నిర్మాత ప్రశ్నార్థ్‌ తాతా దర్శకుడికి ఇచ్చిన స్వేచ్ఛతో ఆయన దీన్నో హాట్‌ చిత్రంగా తయారుచేశాడని అనుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందొ సినిమా అంత అలాగే ఉంటుందని ప్రకటించడంతో యూత్‌లో మరింత క్రేజ్‌ ఏర్పడింది. ఇది బిజినెస్‌ వర్గాలపై కూడా పనిచేసి సినిమా కూడా హాట్‌ కేక్‌లా అమ్ముడుపోవచ్చని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.అలాగే ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగా ఉండచ్చని అందరూ అభిప్రాయపడుతున్నారు .ఈ చిత్రం మార్చినెలలో విడుదల అవుతుంది.వెయిట్ అండ్ సి.....

Facebook Comments
'Ippatlo Ramudila Seethala Evaruntarandi Babu' movie promo is too hot

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.