Social News XYZ     

Maa Inti Baangaram Review: A good comeback film for Samantha (Rating : 3.25)

రివ్యూ: మా ఇంటి బంగారం... ఆకట్టుకుంటుంది

సమంత మూడేళ్ల గ్యాప్‌ తర్వాత కమ్‌ బ్యాక్‌ ఇస్తూ నటించిన మూవీ మా ఇంటి బంగారం. సమంత అనారోగ్యంతో సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ ఇస్తూ ఆమె `మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటించింది. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేసిన చిత్రమిది. ట్రాలాల పిక్చర్స్ పతాకంపై సమంత, ఆమె భర్త రాజ్‌ నిడిమోరు దీన్ని నిర్మించారు. ఇందులో శ్రీముఖి మరో కీలక పాత్రలో నటించారు. టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం నేడు శుక్రవారం(జూన్‌ 19)న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? సమంత అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ ఇచ్చిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

స్వర్ణ(సమంత)... డాక్టర్ హనీ(దిగంద్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. హనీ తన చెల్లి పెళ్లి కోసం చాలా రోజుల తర్వాత తన ఊరు బల్లవరంకి వస్తారు. స్వర్ణని చూసి ఫ్యామిలీ అంతా ఆశ్చర్యపోతారు. ఇంట్లో అందరు ఆమెని అంత ఈజీగా కలుపుకోరు. ప్రశ్నలతో ఆడుకుంటారు. దీంతో వారిని మ్యానేజ్‌ చేయలేక ఇబ్బంది పడుతుంది స్వర్ణ. కానీ నెమ్మదిగా వారికి నచ్చిన పనులు చేస్తూ దగ్గరవుతుంది. అటు మామయ్య(ఆనంద్), అత్తయ్య(గౌతమి)లను కూడా ఫిదా చేస్తుంది. ఉత్తమ కోడలిగా పేరుతెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తనని ఒకడు వెంటాడుతుంటాడు. అతను కరుణ(గుల్షన్‌ దేవయ్య) మనిషి. తను అచ్చం ఝాన్సీలా ఉండటంతో ఆమెని చంపేయమని చెబుతాడు కరుణ.. కానీ స్వర్ణ ...కరుణ మనిషిని చంపేస్తుంది. దీంతో జైల్లో ఉన్న కరుణ రంగంలోకి దిగుతాడు. వచ్చి స్వర్ణని కలుస్తాడు. ఆమెపెళ్లి చేసుకుందని తెలిసి షాక్‌ అవుతాడు. బాధపడతాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెబుతాడు. ఫ్యామిలీని వదిలేసి తనతో రమ్మని, లేదంటే ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తాడు. మరి కరుణ వార్నింగ్‌కి స్వర్ణ భయపడిందా? అతనితో వెళ్లిపోయిందా? ఇంతకి కరుణ ఎవరు? స్వర్ణకి అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఝాన్సీ కథేంటి? ఝాన్సీ..స్వర్ణగా ఎలా మారింది? తన ఫ్యామిలీ కోసం స్వర్ణ చేసిన పోరాటం ఏంటి? ఇందులో శ్రీముఖి పాత్రేంటి? అనేది మిగిలిన కథ.

 

మూవీ విశ్లేషణ:

క్రైమ్‌ బ్యాక్‌ డ్రాప్‌ ఉన్న ఒక అమ్మాయి ఒక డాక్టర్‌ ని ప్రేమించి పెళ్లి చేసుకొని తన గతాన్ని వదిలేసి కొత్తగా ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్‌ చేస్తుండగా, మళ్లీ గతం తనని వెంటాడుతుంది. అది తన ఫ్యామిలీని ప్రమాదంలో పడేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఆమె చేసిన పోరాటమే ఈ మూవీ కథ. ప్రారంభంలో సమంత, తన భర్తతో కలిసి ఊరు రావడం, ఇంట్లో తనని వింతగా చూడటం, ఆమెకి ఫ్యామిలీ కట్టుబాట్లు తెలియకపోవడం, అవి నేర్చుకునే క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాల్లో మంచి కామెడీ ఉంటుంది. సీన్స్ అన్నీ నవ్వించేలా ఉంటాయి.. సమంత ఇన్నోసెంట్‌ గా యాక్ట్ చేసిన తీరు, ఆమె అమాయకంగా కామెడీని పలికించిన తీరు ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఉత్తమ కోడలు అనిపించుకోవడానికి, శ్రీముఖిని మించి బెస్ట్ అనిపించుకోవడం కోసం సమంత చేసే పనులు హిలేరియస్‌గా ఉంటాయి. అందుకోసం తన ఫ్రెండ్‌ ద్వారా వంటలు చేయించడం, ముగ్గులు వేయించడం వంటి సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. ఇదంతా ఓ వైపు తన గతం తాలుకూ విలన్లు వెంటాడటం మరోవైపు. ఈ క్రమంలో వచ్చే యాక్షణ్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఫస్టాఫ్‌ సాగుతుంది. ఇంటర్వెల్‌ వరకు రసవత్తరంగా ఉంటుంది. సెకండాఫ్‌లో గుల్షన్‌ దేవయ్య పాత్ర ఎంట్రీతో మూవీపై మరింత హైప్ పెరుగుతుంది. కరుణ.. స్వర్ణల మధ్య సాగే ఎత్తుకు పై ఎత్తుల సీన్స్. ఫ్యామిలీ డ్రామా... ఎమోషనల్‌ సీన్లు ద్వితీయార్థంలో బాగా ఆకట్టుకుంటాయి.

నటీనటులు ఎలా చేశారంటే..

స్వర్ణ పాత్రలో సమంత ఇరగదీసింది. ఓ వైపు ఇన్నోసెంట్‌గా, ఇంకోవైపు యాక్షన్‌తో వీరమహిళగా కనిపించి అదరగొట్టింది. సినిమాని తన భుజాలపై మోసిందని చెప్పొచ్చు. నటిగా ఆమెని మరో స్థాయికి తీసుకెళ్లే మూవీ అవుతుంది. మంచికమ్‌ బ్యాక్‌ అవుతుంది. హనీగా దిగంత్‌ సెటిల్డ్ గా బాగా చేశాడు. కరుణగా గుల్షన్‌ దేవయ్య అదరగొట్టాడు. కాకపోతే ఆయన పాత్రలో క్లారిటీ మిస్‌ అయ్యింది. రెండో కోడలుగా శ్రీముఖి బాగా చేసింది. ఆమెకి మంచి సీన్లు పడ్డాయి. సమంత ఫ్రెండ్‌గా చేసిన మంజుష నవ్వించింది, మెప్పించింది. అదరగొట్టింది. పెళ్లి కూతురుగా చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఆమెకి వరుసగా సినిమాలువస్తాయి. పోలీస్‌గా చైతన్య కృష్ణ ఆకట్టుకున్నాడు. అత్తగా గౌతమి ఈజీగా తన పాత్రలో జీవించింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. గవిరెడ్డి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. చాలాకాలం తర్వాత హాస్యనటి సీనియర్ నటి శ్రీలక్ష్మి బామ్మ పాత్రలో నటించారు. పొలిటీషియన్ గా సీనియర్ నటుడు ఆనంద్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు.

టెక్నీకల్‌గా ఎలా ఉందంటే...

సంతోష్‌ నారాయణ్‌ మ్యూజిక్‌ మరో అసెట్‌. పెళ్లిలో పాట హైలైట్‌గా నిలుస్తుంది. ఆర్‌ ఆర్‌ అదిరిపోయింది. సినిమాకి ప్లస్‌ గా మారింది. కెమెరా వర్క్ కూడా బాగుంది. విజువల్స్ కనువిందుగా ఉంది. ఎడిటింగ్‌ పరంగా నీట్‌గా ఉంది. దర్శకురాలు నందిని రెడ్డి మంచి కథని ఎంచుకుంది. మాటలు బాగున్నాయి.

చివరగా....
సమంతకిది కమ్‌ బ్యాక్‌ మూవీ... చూసేయండి

రేటింగ్: 3.25

Maa Inti Baangaram Review: A good comeback film for Samantha (Rating : 3.25)

Facebook Comments
Maa Inti Baangaram Review: A good comeback film for Samantha (Rating : 3.25)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.