Social News XYZ     

“Rechipodam Brother” movie review: A movie full of emotions (Rating: 3)

"Rechipodam Brother" movie review: A movie full of emotions (Rating: 3)

నటీ నటులు
అతుల్ కులకర్ణి,రవికిరణ్, దీపాలి శర్మ,భానుశ్రీ,శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : ప్రచోదయ ఫిలిమ్స్

ప్రొడ్యూసర్స్: హనీష్ బాబు ఉయ్యూరు, వివి లక్ష్మీ,
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: ఏ. కె. జంపన్న.
సంగీతం: సాయి కార్తీక్,
లిరిక్స్: భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, పూర్ణచారి;
డి.ఓ.పి: శ్యాం.కె. నాయుడు,
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్,
ఆర్ట్: మహేష్ శివన్,
డాన్సు: భాను,
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

 

Rating 3/5

ఒక దేశానికి అర్మీ ఎంత పవర్ ఫుల్లో మనం ఉండే సొసైటీ లో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ ఫుల్. అలాగే దేశానికి రైతు ఎంతో ముఖ్యమని తెలుపుతూ రైతుల పడే కష్టాలను వివరిస్తూ హ్యుమన్ ఎమోషన్స్ ను, సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను వివరిస్తూ ప్రస్తుత సమాజం పట్ల మనం ఉండాల్సిన బాధ్యతలను వివరిస్తూ మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ను సెలెక్ట్ చేసుకొని తీసిన సినిమా "రెచ్చిపోదాం బ్రదర్". ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో హనీష్ బాబు ఉయ్యూరు,వి.వి లక్ష్మీ,లు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’.ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 29వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండీ

కథ
చంద్ర మౌళి (బాను చందర్),ఇంద్రజ లు భార్యభర్తలు.వీరి ముద్దుల కొడుకు అభి (రవి కిరణ్), మిల్ట్రీ ఆఫీసర్ అయిన బాను చందర్ కు బార్డర్ నుండి పిలుపు రావడంతో వెళ్లిన తను ఉగ్రవాదుల చేతుల్లో చనిపోతాడు , అయితే స్కూల్ లో అభి టీచర్ ను జవాన్, కు జర్నలిస్ట్ కు తేడా ఏంటి అని అడిగగా జవాన్ బార్డర్ లో గన్ను పట్టుకుని ఉగ్రవాదులను మట్టుపెడుతూ దేశాన్ని కాపాడితే జర్నలిస్ట్ పెన్ను పట్టుకుని దేశంలో అవినీతి జరగకుండా దేశాన్ని కాపాడుతాడు జరుగుతుంది. ఇలా ఇద్దరి లక్ష్యం ఒకటే.. దేశాన్ని కాపాడడం అని చెప్పిన టీచర్ మాటలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని జర్నలిస్ట్ అవుతాడు.అభి కి కెమెరామెన్ గా (భానుశ్రీ ) ని నియమిస్తారు. భరణి స్పోర్ట్స్ అకాడమీ పెట్టి ఎందరినో ఛాంపియన్స్ గా తయారు చేస్తున్న నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన భరణి (అతుల్ కులకర్ణి )ని ఇంటర్వ్యూ చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే ఛానల్ సి.ఈ.ఓ కృష్ణ ప్రసాద్ (కోటేశ్వరరావు ),యం.డి బాబురావ్ (బెనర్జీ) లకు అభి వర్క్ నచ్చడంతో పొలిటికల్ లీడర్ ఇంటర్వ్యూ లకు పంపుతారు . అయితే పొలిటికల్ లీడర్స్ చేసే మోసాల కవరేజ్ ను యం.డి కిస్తే వీరు ఆ న్యూస్ ను టెలికాస్ట్ చేయకుండా ఆ న్యూస్ తో పొలిటీసియన్స్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటుంటారు. అయితే ఫార్మర్ మినిష్టర్ అయిన అజయ్ ఘోష్ అసలైన విత్తనాలకు బదులు నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేస్తుంటారు దాంతో రైతులు ఆత్మ హత్యలు చేసుంటుంటారు. ఈ రైతుల ఆత్మ హత్యల న్యూస్ ను ఛానెల్ యం.డి కిస్తే.. ఆ న్యూస్ న్యూస్ టెలికాస్ట్ కాదు. దాంతో అభి ఛానల్ సి.ఈ. ఓ ను, యం. డి లను కలసి రైతు సమస్యల న్యూస్ వేయకుండా పనికి రాని న్యూస్ వేస్తున్నారని నిలదీస్తాడు .దాంతో వారు చెప్పిన మాటలకు షాక్ అయ్యిన అభి జర్నలిజం అంటే నిజాన్ని నిర్భయంగా తెలియజేయడం . అంతే కానీ డబ్బులకు అమ్ముడుబోయే మీలాంటి వారికి తలొగ్గి మీరు చెప్పిన పని చేయాలనేది జర్నలిజం కాదని నేను ఇందులోనే ఉంటే నా జీవితాన్ని కూడా మీరే తినేస్తారని ఛానెల్ నుండి బయటికివచ్చి ఒక యూట్యూబ్ ఛానెల్ పెడతాడు. అందులో రైతులను, సమాజానికి ఉపయోగపడే విధమైన వారిని ఇంటర్వ్యూ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో తోటి జర్నలిస్ట్ శశాంక్ కు చిన్న దెబ్బ తగిలితే హాస్పిటల్ కు తీసుకెళ్తారు.అయితే తను అనూహ్యంగా హాస్పిటల్ సిబ్బంది చనిపోయాడు అని చెప్తారు. షాక్ అయిన వీరు చిన్న దెబ్బకే ఎలా చనిపోయాడు అని ఎంక్వయిరీ చేయగా నమ్మలేని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. అయితే ఇదంతా చేస్తున్న గ్యాంగ్ కు నాయకుడెవరు ? ఆ గ్యాంగ్ ను అభి పట్టుకున్నాడా? దీని వెనుక ఉన్న అసలు సూత్ర దారులెవ్వరు ? ఈ ప్రాజెక్ట్ లో జరుగుతున్న ప్రాబ్లెమ్స్ ను అభి సాల్వ్ చేశాడా లేదా? అనే క్రమంలో అసలైన జర్నలిస్ట్ గా పని చేస్తే సమాజంలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది తెలియాలంటే “రెచ్చి పోదాం బ్రదర్ ” సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
మన ఎదుటి వ్యక్తికి ఏదైనా జరిగితే ప్రతి మనిషి రెస్పాన్ద్ అవ్వాలి అనే విధంగా అభి పాత్రలో(రవికిరణ్) నటన అద్భుతంగా ఉంది.దీనికి తోడు ఈ సినిమాకు హీరో వాయిస్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.తనకిది మెదటి సినిమా అయినా ఎన్నో సినిమాలలో నటించినట్లు అద్భుతంగా నటించాడు. ముందు ముందు తను మంచి హీరో అవుతాడు, మంచి మనిషి లా (ముసుగు కప్పుకున్న ఉంటూ మేకవన్నె పులి) భరణి పాత్రలో (అతుల్ కులకర్ణి) విలనిజం చాలా బాగుంది. తను యంగ్ ఏజ్ లో బాక్సర్ గా ఏజ్ అయిన తరువాత బిజీనెస్ మెన్ గా రెండు పాత్రలలో చాలా చక్కగా నటించాడు, సీనియర్ నటి ఇంద్రజ తల్లి పాత్రలో ఒదిగిపోయింది. దీపాలి శర్మ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.తను న్యాచురల్ గా చాలా బాగా నటించింది. రైతుగా శివాజీరాజా చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు , పోలీస్ ఆఫీసర్ గా పోసాని,హీరో కు ఫ్రెండ్ గా శశాంక్, హీరో కు ఫాదర్ గా భానుచందర్, ఛానల్ సి. ఈ. ఓ యం. డి గా, కోటేశ్వరరావు, బెనర్జీ, ఫార్మర్ మినిష్టర్ గా నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేసే పాత్రలో అజయ్‌గోష్, షణ్ముఖం (అప్పాజీ), ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ ఇలా ప్రతి ఒక్కరూ వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఒక దేశానికి అర్మీ ఎంత పవర్ ఫుల్లో మనం ఉండే సొసైటీ లో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ ఫుల్ అంటూ మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ను సెలెక్ట్ చేసుకొని దర్శకులు ఏ. కే. జంపన్న తెరకెక్కించిన విధానం చాలా స్టైలిష్‌గా, ఆలోచింప జేసే విధంగా ఉంది. ఈ సినిమాలో సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో పాటు డైలాగ్స్ పుష్కళంగా ఉన్నాయి. ఒక పోలీస్, జర్నలిస్ట్ తలచుకొంటే సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి అని చాలా చక్కగా చెప్పారు దర్శకుడు జంపన్న. అలాగే ఈ చిత్రం చూస్తున్నంత సేపు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆడియన్స్ ను సీట్లోనే కూర్చోబెట్టడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు . సాయి కార్తీక్ సంగీతం చాలా బాగుంది.,ఇందులోని పాట చాలా ట్రెండీగా, కొత్తగా ఉంది . "యుద్ధం శరణం - తప్పదు ప్రళయం" అను సాంగ్ చాలా బాగుంది. శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’అని చెప్పచ్చు.తను మంచి ఔట్ పుట్ ఇచ్చాడు.కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, సమాకూరుర్చిన ఫైట్స్ చాలా డిఫరెంట్‌ గా ఉన్నాయి. ప్రొడక్షన్ లొకి కొత్తగా వచ్చినా ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాతలు హనీష్ బాబు, వివి లక్ష్మీ, ఉయ్యూరు లు పెట్టిన ప్రతి పైసా తెరమీద కనిపిస్తుంది సినిమా బాగా రావాలని ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని చాలా రిచ్ గా నిర్మించారు.నేటి యువత‌ను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ “రెచ్చిపోదాం బ్రదర్ ” కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది..

స్టార్ ను నమ్మి కాకుండా కథను నమ్మి ఈ సినిమాకు వస్తే ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది.

Facebook Comments
"Rechipodam Brother" movie review: A movie full of emotions (Rating: 3)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
"Rechipodam Brother" movie review: A movie full of emotions (Rating: 3)
Review Date
Reviewed Item
Rechipodam Brother
Author Rating
3"Rechipodam Brother" movie review: A movie full of emotions (Rating: 3)"Rechipodam Brother" movie review: A movie full of emotions (Rating: 3)"Rechipodam Brother" movie review: A movie full of emotions (Rating: 3)"Rechipodam Brother" movie review: A movie full of emotions (Rating: 3)"Rechipodam Brother" movie review: A movie full of emotions (Rating: 3)
Title
Rechipodam Brother
Description
Rechipodam Brother
Upload Date
July 29, 2022
%d bloggers like this: