Social News XYZ     

Jetti Movie Poster Launched By Trivikram Srinivas

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆవిష్కరించిన జెట్టి పోస్టర్

వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మాత గా సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా జెట్టి. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని సరికొత్త సముద్రపు కథ, అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి జీవితాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక. ఈ మూవీ పోస్టర్ ని టాలీవుడ్ టాప్ దర్శకుడు త్రివిక్రమ్ లాంఛ్ చేసారు. కథ ను తెలుసుకొని టీం ని అభినందించారు. బీమ్లానాయక్ షూటింగ్ లోకేషన్ లో ఈ పోస్టర్ లాంఛ్ జరిగింది. కొన్ని కథలు ఆ ప్రాంతపు హాద్దులను దాటవు.. వారి బాధలు ఆ కుటుంబాల గడపలు దాటవు.. అలాంటి సబ్జెక్ట్ ను తెరమీదకు తీసుకు వచ్చిన దర్శకుడిని అభినందించారు త్రివిక్రమ్ .

ఈ సంద‌ర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూః ‘‘ సముద్రపు బ్యాక్ డ్రాప్ లో కథలు ఎంచుకోవడం చాలా సాహాసంతో కూడుకున్నది . వీరి మేకింగ్ లో చాలా ప్యాషన్ కనపడింది. వీరు ఎంచుకున్న నేపథ్యం ఖచ్చితంగా తెలుగు తెరకు కొత్తది. సుబ్రమణ్యం పిచ్చుక తనదైన ముద్రతో వస్తున్నాడు. నిర్మాత వేణు మాధవ్ గారికి మరియు జెట్టి లో నటించిన నందిత శ్వేతకు ఇతర నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు ’’ అన్నారు.

 

దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక మాట్లాడుతూ: ‘‘ త్రివిక్రమ్ గారిని కలవడం ఇదే మొదటి సారి ఆయన మా టీం తో పంచుకున్న మాటలు మాకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. మా టీం అందరం ఆయనకు రుణ పడి ఉంటాం. జెట్టి మూవీ తో ఇప్పటి వరకూ తెలుగు తెరపై కనిపించని కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. తప్పకుండా ప్రేక్షకులు ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాం ’’అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటున్నాం.. అక్టోబర్ మొదటి వారంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుులు కంప్లీట్ అవుతాయని ’’ అన్నారు.

బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్ మ్యూజిక్ : కార్తిక్ కొండ‌కండ్ల‌ డిఓపి: వీర‌మ‌ణి ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి ఎడిటర్: శ్రీనివాస్ తోట‌ స్టంట్స్: దేవరాజ్ నునె కోరియోగ్రాఫర్ : అనీష్ పబ్లిసిటీ డిజైనర్: సుధీర్ డైలాగ్స్ ః శ‌శిధ‌ర్ పిఆర్ ఓ : జియస్ కె మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పండ్రాజు శంక‌ర్రావు నిర్మాత ః వేణు మాధ‌వ్ క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక

నటీ నటులు: నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ య‌స్ చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు

Facebook Comments

%d bloggers like this: