Social News XYZ     

Leharaayi Lyrical Song From Most Eligible Bachelor Gets Good Response

అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి ‘లెహరాయీ’ లిరికల్ సాంగ్‌కు అనూహ్య స్పందన..

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి‘ అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ కూడా అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.

ఈ పాట లిరిక్స్..

 

లెహరాయి.. లెహరాయీ.. ఏ లేలేలే.. లేలేలేలే..
లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..
లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..
ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..
కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..
సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..

లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..
లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

రోజూ చక్కిలితో సిగ్గుల తగువాయే..
రోజూ పెదవులతో ముద్దుల గొడవాయే..
వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే..
మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ..

లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..
లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

వేలా పాలలనే మరిచే సరసాలే..
తేదీ వారాలే చెరిపే చెరసాలే..
చనువు కొంచెం పెంచుకుంటూ.. తనువు బరువే పంచుకుంటూ..
మనలోకం మైకం ఏకం అవుతూ.. ఏకాంతాలే లెహరాయీ..

లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..
లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..
ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..
కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..
సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..

న‌టీ న‌టులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Facebook Comments

%d bloggers like this: