Social News XYZ     

MLC Narasimha Reddy Meet Minister Talansani Srivas Yadav And Requested To Help Movie Theater Workers

సినిమా థియేటర్స్ కార్మికులను ఆదుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసిన ఎమ్మెల్సీ ఏ. నర్సిరెడ్డి గారు

తెలంగాణ రాష్ట్రంలోని సినిమా థియేటర్స్ లో పనిచేస్తున్న కార్మికులకు లాక్‌డౌన్‌ కాలానికి పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు మరియు సినిమా థియేటర్ కార్మిక సంఘం నాయకులు జె. వెంకటేష్, ఎం . మారన్న , కె. అరుణ్ ప్రతినిధి బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఏ. నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ లాక్ డౌన్ కాలానికి ( మార్చి, ఏప్రిల్ , మే ) పూర్తి వేతనం ఇవ్వాలని మరియు ప్రభుత్వం తరఫున నిత్యవసర సరుకులు మరియు 7 500 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు రాష్ట్రంలో సినిమా థియేటర్స్ లో సుమారు 25 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వీరికి covid 19 లాక్ డౌన్ సందర్భంగా మార్చి ఏప్రిల్ మే మూడు మాసాలకు సంబంధించిన పూర్తి వేతనం యజమానులు ఇవ్వలేదు, ప్రభుత్వ ఉత్తర్వులు 45 ప్రకారం పూర్తి వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా సదరు యజమానులు అమలు చేయటం లేదు దీనివల్ల కార్మిక కుటుంబాలను పోషించు కోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది యజమానులు 40 50 శాతం మాత్రమే వేతనాలు ఇస్తూ బలవంతంగా తెల్లకాగితాలమీద సంతకాలు తీసుకుని పరోక్షంగా తొలగింపునకు అంగీకరిస్తున్నట్లు ఒప్పందం తీసుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది ఇది సరైంది కాదు

గత 20 సంవత్సరాల నుండి ఈ రంగాన్ని నమ్ముకొని చేస్తున్న కార్మికులను యజమాన్యాలు ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమించి, లాక్ డౌన్ పేరుతో తక్కువ వేతనాలు ఇవ్వడం విధుల నుండి తొలగించడం బెదిరింపులకు పాల్పడడం శోచనీయం. కార్మికులకు ఈ విపత్కర పరిస్థితుల్లో వేరే రంగాల్లో ఉపాధి పొందే అవకాశం కూడా లేదు కావున ప్రభుత్వ అధికారులు , మంత్రివర్యులు, జోక్యం చేసుకొని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వీరికి మార్చి ఏప్రిల్ మీ మూడు మాసాల పూర్తి వేతనం ఇప్పించాలని వీరిని విధుల నుండి తొలగించకుండా థియేటర్ ప్రారంభ అయ్యే అంతవరకు కొనసాగించుటకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరడం జరిగింది

 

సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సానుకూలంగా స్పందించి థియేటర్ల యజమానులతో చర్చించి వేతనాలు ఇప్పించడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

వినతి పత్రం సమర్పించిన బృందంలో ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి గారు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి వెంకటేష్ గారు తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం మారన్న రాష్ట్ర కార్యదర్శి కె అరుణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ సత్తయ్య సుధాకర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు

Facebook Comments

%d bloggers like this: