Social News XYZ     

Dear Comrade music festival held in Hyderabad

Dear Comrade music festival held in Hyderabad

Dear Comrade music festival held in Hyderabad (Photo:SocialNews.XYZ)

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. ఈ సంద‌ర్భంగా శుక్రవారం చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో సినిమాలోని పాట‌ల‌ను లైవ్‌గా పద‌ర్శించ‌డ‌మే కాకుండా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక స్టేజ్‌పై పాట‌ల‌కు డ్యాన్సులు చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

ఈ సంద‌ర్బంగా.. క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ - మ‌నంంద‌రిలో చాలా భ‌యాలుంటాయి. అయితే వాటిని వ‌దిలేస్తేనే మ‌నం గెలుస్తాం. నేను కూడా న‌టుడు కావాలనుక‌న్న‌ప్పుడు భ‌య‌మేసింది. మ‌న‌కు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి. అప్పుడే అది మ‌న‌కు ద‌క్కుతుంది. ఈ విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్న‌మే `డియర్ కామ్రేడ్‌` సినిమా. బెంగ‌ళూరు, కొచ్చి, చెన్నైల్లో ఈ సినిమా మ్యూజిక్ ఫెస్టివ‌ల్స్ చేశాం. ప్రేక్ష‌కులు ప్ర‌తిచోటా మాకు ప్రేమ‌నే పంచారు. ఇంత ప్రేమ‌కు థ్యాంక్స్ చెబితే స‌రిపోతుందా? అనిపించింది. జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. ద‌క్షిణాది భాష‌ల్లో చేసిన తొలి ప్ర‌య‌త్నం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు.

 

ర‌ష్మిక మంద‌న్న మాట్లాడుతూ - నేను సినిమాల్లోకి రావాల‌నుకున్నాను. అయితే చాలా మంది వ‌ద్ద‌నే అన్నారు. సినిమా రంగంశ్రేయ‌స్క‌రం కాద‌ని చెప్పారు. అయితే నేను ప్రేమించిన దాని కోసం క‌ష్ట‌ప‌డ్డాను. అంద‌రినీ ఒప్పించాను. ప్ర‌తి అమ్మాయి చూడాల్సిన సినిమా. అంద‌రూ వారు ప్రేమించిన దాని కోసం పోరాటం చేయాలి అన్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన నాలుగు భాష‌ల ట్రైల‌ర్ అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాదాపు ట్రైలర్‌కు 15 మిలియన్ వ్యూస్ రావడంతో సినిమాపై ఎంత‌టి అంచ‌నాలున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సాంగ్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక జంట ఇన్‌టెన్స్ యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం ఖాయ‌మ‌ని అనుకుంటున్నారు.

సాంకేతిక నిపుణులు: క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌క‌త్వం: భ‌ర‌త్ క‌మ్మ‌ బ్యాన‌ర్స్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌ నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సి.ఇ.ఒ: చెర్రీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వై.అనీల్‌ మ్యూజిక్‌: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్ ఎడిటింగ్ & డి.ఐ: శ‌్రీజిత్ సారంగ్‌ డైలాగ్స్‌: జె కృష్ణ‌ ఆర్ట్ డైరెక్ట‌ర్‌: రామాంజ‌నేయులు సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, రహ‌మాన్‌, కృష్ణ‌కాంత్‌ కొరియోగ్రాఫర్‌: దినేష్ మాస్ట‌ర్‌ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: అశ్వంత్ బైరి, ర‌జ‌ని యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌: జి.ముర‌ళి ప‌బ్లిసిటీ డిజైన్‌: అనీల్, భాను పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌

Facebook Comments

%d bloggers like this: