పుల్వామా అమరవీరుల కుటుంబాలకు ఎఫ్ఎన్‌సీసీ భారీ విరాళం

Film Newscasters Association of Electronic Media Donates to Pulwama Victims Fund (Photo:SocialNews.XYZ)
అసోసియేషన్‌లో ఒక సభ్యుడైన భాసిరెడ్డి నాగఅన్వేష్ తనవంతు సాయంగా లక్ష రూపాయలు అందించారు. రెండు మొత్తాలకు సంబంధించిన చెక్కులను అసోసియేషన్ సభ్యులు సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అందచేశారు. చెక్కులు అందుకున్న సీఆర్పీఎఫ్ కార్యాలయ అధికారి ఐపీఎస్ శ్రీకే దుర్గాప్రసాద్(మాజీ డీజీపీ), సథరన్ సెక్టార్ ఐజీపీ జీహెచ్‌పీ రాజు ఎఫ్ఎన్‌సీసీ సభ్యులను అభినందించారు. ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల జవాన్ల మనోధైర్యం మరింత బలపడుతుందని ఈ సందర్భంగా ఐజీపీ జీహెచ్‌పీ రాజు తెలిపారు. ఈ మొత్తాన్ని భారత్ వీర్ అకౌంట్‌లో జమ చేస్తామని చెప్పారు.
సీఆర్పీఎఫ్ అధికారులను కలిసి చెక్కులు అందజేసిన వారిలో ఎఫ్ఎన్‌సీసీ సెక్రెటరీ బి. రాజశేఖర్‌రెడ్డి, కమిటీ సభ్యులు శ్రీమతి శైలజ జుజాల, పి. రామకిశోర్, కే సదాశివరెడ్డి, వీవీఎస్ఎస్ పెద్దిరాజు, సురేష్ కొండేటి ఉన్నారు.