Social News XYZ     

APTA held a mega blood drive in USA

అప్త ఆధ్వ‌ర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్-2017

APTA held a mega blood drive in USA

మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాల సినిమా సేవలను కొనియాడుతూ చిరంజీవి రక్తదాన సేవలకు సంఘీభావాన్ని తెలుపుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రానున్న 40 రోజుల్లో 40 రక్తదాన శిబిరాలను నిర్వహించాలని విజయ్ రేపల్లె గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వర్జీనియా రాష్ట్రంలోని స్టెర్లింగ్ నగరం ఇనోవా హాస్పిటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చిరంజీవి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది దాతలు ర‌క్త‌దానం చేశారు.

 

అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఇనోవా బ్లడ్ డొనేషన్స్ స్టెర్లింగ్ హాస్పిటల్స్ మేనేజర్ AJ చిరంజీవి బ్లడ్ బ్యాంకు గురించి ప్రస్తావించి, బ్ల‌డ్ బ్యాంక్ సేవలను కొనియాడారు. ఈ స‌మ‌యంలో చిరంజీవి అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం మ‌రింత రెట్టింపయ్యిందని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయ్ రేపల్లె గారు అమెరికాలోని ఆప్త సంస్థ ఆధ్వర్యంలో అక్కడున్న చిరంజీవి అభిమానుల సహాయంతో కుటుంబ కార్యక్రమంగా నిర్వహించడంతో అధిక శాతం మహిళలు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదే వేదిక‌పై అఖిల భారత చిరంజీవి యువత అభిమాన సంఘం అధ్యక్షులు స్వామి నాయుడు పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

Facebook Comments
APTA held a mega blood drive in USA

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: