Social News XYZ     

Prestigious “Gautamiputra Satakarni” Releasing on Jan 12th

Gautamiputra Satakarni Invading World On Jan 12th, 2017

Prestigious "Gautamiputra Satakarni" Releasing on Jan 12th

There’s no bigger occasion than Gautamiputra Satakarni release to make the coming Sankranti festival a special season for Telugu audience. Natasimha Nandamuri Balakrishna’s historical 100th film Gautamiputra Satakarni is going to invade entire world on January 12th, 2017. The official release date announcement is here made by respected producers Y Rajiv Reddy, Jagarlamudi Saibabu.

 

“Gautamiputra Satakarni is a historical project directed by National Award winning Jagarlamuldi Krish on First Frame Entertainments banner. We proudly announce the release date of our movie as January 12th across the globe. On this beginning day of New Year 2017, we take it on pride to declare our arrival for Sankranti.

Journey with Satakarni was dream come true for us to work with Balakrishna Garu. He supported us throughout from Morocco first schedule to second schedule near Chilkur Balaji temple in Hyderabad followed by third massive schedule in Georgia and then the fourth schedule in Madhya Pradesh.
Appreciations poured in for Gautamiputra Satakarni posters, teaser, trailer and the final audio released on the hands of AP Chief Minister Chandrababu Naidu and Central Minister Venkayya Naidu.

We cherish every moment of our working with GPSK for life long. The visual grandeur with strong content and extra ordinary performances epitomizes the dedication from our entire team.

We thank one and all for their enormous support. Let 2017 begin with the dawn of Satavahanas. Please watch Gautamiputra Satakarni only on big screen to feel the real cinematic experience and avoid piracy. Let us meet in theaters on Jan 12th,” said producers.

Casting: Balakrishna, Hema Malini, Shriya Saran, Kabeer Bedi and others.
Presenter: Bibo Srinivas
Cinematographer: Gnanashekhar
Art: Bhupesh Bhupathi
Lyrics: Sirivennela Sitarama Shastri
Dialogues: Saimadhav Burra
Fights: Ram Lakshman
Music: Chirantan Bhatt
Co producer: Kommineni Venkateswara Rao
Producers: Y Rajiv Reddy, Jagarlamudi Saibabu
Director: Krish
Release Date: January 12, 2017

శాతకర్ణి దండయాత్రకు సమయం ఆసన్నమైనది - జనవరి 12, 2017

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమాగానే కాక, అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహారాజు "శాతకర్ణి" జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా యావత్ ప్రపంచంలోని తెలుగు సినిమా అభిమానులందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". "శాతకర్ణి"గా నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహార్యం తెలుగువారిని అమితంగా ఆకట్టుకోగా, "గౌతమిపుత్ర శాతకర్ణి" టీజర్, ట్రైలర్ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇక చిరంతన్ భట్ స్వరపరిచిన బాణీలతే సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తూ.. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆశగా ఎదురుచూసేలా చేసింది.

ప్రేక్షకుల, నందమూరి అభిమానుల ఎదురుచూపులకు సమాధానంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబులు "గౌతమిపుత్ర శాతకర్ణి" విడుదల తేదీని నేడు నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. సినిమా ప్రారంభోత్సవం నాడే "సంక్రాంతి సినిమా" అని సినిమా యూనిట్ సభ్యులందరూ సగర్వంగా ప్రకటించిన ఈ చిత్రం అన్నమాట ప్రకారం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబులు మాట్లాడుతూ.. "నందమూరి బాలకృష్ణగారితో పనిచేయాలన్న మా కోరిక "గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి అద్భుతమైన సినిమా ద్వారా తీరడం చాలా సంతోషంగా ఉంది. బాలయ్య 100వ సినిమా అయిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తుండడం మాకు గర్వకారణం. మోరోకో, మధ్యప్రదేశ్ ప్రదేశాల్లో చిత్రీకరించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బాలకృష్ణగారు చూపిన తెగువ, ఆయన అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినీలు పోషించిన ప్రత్యేక పాత్రలు సినిమాకి ఆయువుపట్టు. మా క్రిష్ ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా రూపొందించడంతోపాటుగా తెలుగువారికి తెలియని తెలుగోడు "శాతకర్ణి" ఘనకీర్తిని అద్భుతంగా తెరకెక్కించాడు. శాతవాహన రాజుల్లోకెల్లా అత్యంత శూరుడైన "శాతకర్ణి" చరిత్రతో ఈ సంక్రాంతికి శుభారంభాన్నిద్దాం. పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్ లోనే చూడాల్సిందిగా నిర్మాతలుగా మా మనవి" అన్నారు.

హేమమాలిని, శ్రేయ శరన్, కబీర్ బేడీలు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, కళ: భూపేష్ భూపతి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్ర, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు, సమర్పణ: బిబో శ్రీనివాస్, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్!

Facebook Comments
Prestigious "Gautamiputra Satakarni" Releasing on Jan 12th

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: