Social News XYZ     

Devika & Danny – Telugu Web Series Review: A clean and decent entertainer (Rating:3.0)

నటీనటులు : రీతు వర్మ, సూర్య వసిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్ మరియు ఇతరులు

దర్శకుడు : బి.కిషోర్
రైటింగ్ అండ్ క్రియేట్ : దీపక్ రాజ్
ప్రొడక్షన్ హౌస్ : జాయ్ ఫిల్మ్స్
నిర్మాత : సుధాకర్ చాగంటి
కో ప్రొడ్యూసర్ : సురేష్ ఎర్ర
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : నాగ నందిని
ప్రొడక్షన్ డిజైనర్ : రామాంజనేయులు
సంగీత దర్శకుడు : జై క్రిష్
సినిమాటోగ్రాఫర్ : వెంకట్ సి దిలీప్
ఎడిటర్ : కార్తికేయ రోహిణి
సౌండ్ డిజైన్ : ఎతిరాజ్
లిరిక్స్ : DR రామ్
కలరిస్ట్ : v. రామ్ మూర్తి నేత , లావణ్య రెడ్డి తేటల

బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ హీరోయిన్ గా సూర్య వశిష్ఠ , శివ కందుకూరి హీరోలుగా ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు బి కిషోర్ తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో మన రివ్యూ లో చూద్దాం..

కథ:

 

టీచర్ గా పని చేసే దేవిక (రీతూ వర్మ) జగ్గూ (సుబ్బరాజ్) తో ఎంగేజ్మెంట్ జరుగుతుంది.. కానీ ఒక పూజారి దేవిక ప్రేమలో పడుతుంది జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు... కొద్ది రోజులకే డానీ అనే అబ్బాయి ( సూర్య వశిష్ఠ) పరిచయం అవుతాడు దేవిక కి బాగా నచ్చుతూ ఉంటాడు.. ఆ కొద్ది రోజులకే శివ కందుకూరి పరిచయం అవుతాడు... ఈ ఇద్దరిలో ఎవరితో ప్రేమలో పడుతుంది అలాగే సుబ్బరాజు తో ఎంగేజ్మెంట్ ఏమవుతుంది.. అసలు ఆ దోషం ఏమిటి చివరికి ఏమి జరుగుతుందో చూద్దాం

ప్లస్ పాయింట్స్:

పల్లెటూరి నేపథ్యంలో ఈ సిరీస్ మొదలవుతుంది... రీతు వర్మ ఓటీటీ లో డెబ్యూ , పల్లెటూరి అమ్మాయి గా క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది అందంగా ఉంది , టీచర్ గా ప్రాబ్లం వస్తె ఎదిరించే అమ్మాయి లాగా బాగా చేసింది.. సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది , శివ కందుకూరి పల్లెటూరి అబ్బాయి గా బాగా సెట్ అయ్యాడు. సుబ్బరాజు నీ పల్లెటూరి క్యారెక్టర్ లో కొత్తగా అనిపించాడు, చల్ రోజుల తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిచించారు... సిరీస్ కి ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది

రీతు వర్మ , సూర్య వశిష్ఠ సీన్స్ క్యూట్ గా బాగున్నాయి.. సుబ్బరాజు లైట్ కామెడీ , శివ కందుకూరి అమాయకత్వం సీన్స్ వర్కవుట్ అయ్యాయి.. ఫ్యామిలీ తో హ్యాపీగా చూడొచు.

మొత్తం మనకు ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి... ఒక్కో ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది...
అప్పుడే ఐపోయిందిదా అనే ఫీలింగ్ వస్తుంది

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్ పై చాగంటి సుధాకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సిరీస్ ని నిర్మాణం వహించారు. వెంకట్ సి దిలీప్ ఇచ్చిన కెమెరా విజువల్స్ బాగున్నాయి. అలాగే జై కృష్ణ సంగీతం బాగుంది. కార్తికేయన్ ఎడిటింగ్ బాగుంది.... పాటలు కూడా బానే ఉన్నాయి

రీతు వర్మ కాస్ట్యూమ్స్ , పల్లెటూరి సెటప్ ఫ్రెష్ ఫీలింగ్ నీ తీసుకొచ్చింది సిరీస్ కి

ఇక దర్శకుడు బి కిషోర్ విషయానికి వస్తే. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుండి స్టార్ట్ అయి శ్రీకారం సినిమాతో దర్శకుడిగా మారి ఇప్పుడు ఒక కూల్ లైన్ తో ఓటీటీ కి వచ్చాడు...తాను చెప్పాలి అనుకున్న పాయింట్ ని క్లియర్ గా సాఫీగా ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా చెప్పాడు.. లవ్ సీన్స్ అండ్ లాస్ట్ లో ఎమోషన్ సీన్స్ బాగా చూపించాడు ... ఆ అట్మాస్పియర్ లోకి తీసుకువెళ్ళాడు

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘దేవిక & డానీ’ సిరీస్ ఒక క్లీన్ అండ్ సింపుల్ గా సాగే డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. లీడ్ నటీనటులు బాగా చేశారు...ఒక డీసెంట్ సిరీస్ ని అది కూడా ఫ్యామిలీతో కలిసి చూడాలి అనుకునే వారు జియో హాట్ స్టార్ లో ఈ సిరీస్ ని చూడొచ్చు.

Rating: 3/5

Devika & Danny – Telugu Web Series Review: A clean and decent entertainer (Rating:3.0)

Facebook Comments
Devika & Danny – Telugu Web Series Review: A clean and decent entertainer (Rating:3.0)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.