Social News XYZ     

Pan India Movie… Six Teens Sequel ‘Risk’ Motion Poster Released by ‘Dhamaka’ Director Trinadha Rao Nakkina

పాన్ ఇండియా మూవీ... సిక్స్ టీన్స్ సీక్వెల్ 'రిస్క్' మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన 'ధమాకా' దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన

ఇరవైఏళ్ళ క్రితం "దేవుడు వరమందిస్తే... నిన్నే కోరుకుంటాలే!" అనే గీతం అప్పటి యూత్ ని విశేషంగా ఆకట్టుకుని సంచలనం సృటించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ స్వరపరిచిన ఆ పాట సిక్స్ టీన్స్ చిత్రంలోనిది. అయితే సిక్స్ టీన్స్ సీక్వెల్ గా ప్రస్తుతం ఘంటాడి కృష్ణ పాన్ ఇండియా మూవీని, రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో 'రిస్క్' అనే మూవీ నిర్మించారు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ధమాకా దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన నిన్న జనవరి 21న శనివారం సాయంత్రం 05:05 గంటలకు విడుదల చేసారు. ఘంటాడి కృష్ణకు చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు సినిమా అన్ని భాషల్లో ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. " ఘంటాడి కృష్ణ గారి పాటలంటే నాకు ఎంతో ఇష్టం సంపంగి చిత్రంలో సాంగ్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. దేవుడు వరమందిస్తే... నిన్నే కోరుకుంటాలే! పాటతో అయన కన్నడ పరిశ్రమలో కూడా గుర్తింపు పొందాడు. ఆయన స్వీయ దర్శకత్వం లో అందిస్తున్న 'రిస్క్' లో కూడా పాటలు బాగుంటాయని అనుకుంటున్నాను. ఈ రోజు విడుదల చేసిన రిస్క్ మోషన్ పోస్టర్ కూడా అద్భుతంగా వుంది. ఒకే సారి నాలుగు భాషల్లో విడుదల చేయడం అభినందనీయం" అన్నారు.

 

నిర్మాత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ..."మా ప్రొడక్షన్ నెంబర్ వన్ జి కె మిరకిల్స్ బ్యానర్ లో అందిస్తున్న చిత్రం 'రిస్క్'. ఇరవైఏళ్ళ క్రితం "దేవుడు వరమందిస్తే... నిన్నే కోరుకుంటాలే!" పాట తెలుగు ప్రేక్షకులకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసింది. ఆ పాట సక్సెస్ ఫుల్ మూవీ 'సిక్స్ టీన్స్' చిత్రంలోనిది. అయితే మళ్ళీ అలాంటి నలుగురు కుర్రాళ్ళ కథ తో ఈ సారి ఓ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో 'రిస్క్' అనే చిత్రాన్ని నేటి యూత్ కి నచ్చేవిధంగా స్వీయ దర్శకత్వం లో నిర్మించాను. ఈ చిత్రంలో 8 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటుంది. ఈ వారం లోనే నాలుగు భాషల్లో సిద్ శ్రీ రామ్ ఆలపించిన లిరికల్ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాం. " అన్నారు.

హీరో గా పరిచయం అవుతున్న సందీప్ అశ్వా మాట్లాడుతూ..." రిస్క్ చిత్రంతో నన్ను హీరోగా పరిచయం చేసిన ఘంటాడి కృష్ణ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా నేటి జనరేషన్ కి సంబందించిన కథ, అత్యాశకు పోయి అక్రమార్గంలో డబ్బు సంపాదించాలనుకునే నలుగురు యువకులు ఎలాంటి రిస్క్ లో ఇరుక్కున్నారో? ఆ తరువాత రియలైజ్ అయ్యి ఏ విధంగా బయటపడ్డారన్నది ప్రధాన ఇతివృత్తం. ఘంటాడి గారు ఈ చిత్రంలో నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా మ్యూజిక్ అందించారు." అన్నారు.

తారగణం : సందీప్ అశ్వా, రవీంద్రనాథ్ ఠాకూర్, తరుణ్ సాగర్, విశ్వేష్, జోయా ఝవేరి, సానియా ఠాకూర్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిళ్ళ, దువ్వాసి మోహన్, కాదంబరి కిరణ్, టిఎన్ఆర్, అప్పారావు(జబర్దస్త్), టార్జాన్, రాజమౌళి (జబర్దస్త్), రాజా (జబర్దస్త్), శ్వేతా (నక్కిలిసు గొలుసు ఫేమ్) తదితరులు నటించారు.

టెక్నికల్ టీం :
రచన - దర్శకత్వం : G K (ఘంటాడి కృష్ణ)
నిర్మాణ నిర్వహణ : రావి సురేష్ రెడ్డి,
నిర్మాణ సహకారం : గడ్డం రవి, మహేష్ కాలే, గుర్రం నర్సింహులు,
బ్యానర్: జి కె మిరకిల్స్
మ్యూజిక్ : G K (ఘంటాడి కృష్ణ),
డీవోపీ: జగదీశ్ కొమరి
ఎడిటర్: శివ శార్వాణి,
ఆర్ట్: మురళి,
ఫైట్స్: శంకర్ మాస్టర్,
కోరీయోగ్రాఫర్స్ : రఘు, అజయ్ సాయి, వెంకట్ డీప్, అజ్జు - మెహర్,
పాటలు : సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, G K, వరికుప్పల,
కో - డైరెక్టర్ : బన్సీ కోయల్కర్,
రైటర్స్ క్రివ్ : శివ, నవీన్, నరేన్,
ప్రొడక్షన్ డిజైనర్ : రాహుల్,
కో - ఆర్డినేటర్ : రాంబాబు వర్మ
పోస్టర్ డిజైనర్స్ : ధని ఏలే, కిషోర్, ఈశ్వర్,

MOTION POSTER LINKS:
TELUGU - https://youtu.be/krXMqpwvxgA
HINDI - https://youtu.be/25s7nmx-o7Y
KANNADA - https://youtu.be/jpy-wmaAtKg
TAMIL - https://youtu.be/rZH3yat7Er8

MOTION POSTER LAUNCH FULL VIDEO (COPYRIGHT FREE CONTENT)
https://we.tl/t-JYzxZgmq7Z

Facebook Comments
Pan India Movie... Six Teens Sequel 'Risk' Motion Poster Released by 'Dhamaka' Director Trinadha Rao Nakkina

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: