Social News XYZ     

Don’t hinder development works in Chitrapuri colony: President Anil Kumar Vallabhaneni

చిత్రపురి అభివృద్ధికి అడ్డుపడకండి - అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని

చిత్రపురి కాలనీ అభివృద్ధి పనులను అడ్డుపడొద్దని అధ్యక్షులు అనిల్ కుమార్

వల్లభనేని విజ్ఞప్తి చేశారు. కాలనీలోని కొందరు సభ్యులు కోర్టుల్లో కేసులు వేయడం, ధర్నాలు చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని ఆయన అన్నారు. శనివారం చిత్రపురి కాలనీ ఎంఐజీ ప్రాంగణంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కమిటీ ట్రెజరర్ మహానంద రెడ్డి, కార్యదర్శి కాదంబరి కిరణ్, సభ్యులు అలహరి, కొంగర రామకృష్ణ, అనిత, లలిత, బత్తుల రఘు తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ...మా కమిటీ 2020 డిసెంబర్ లో ఎన్నికయ్యాం. అప్పటి నుంచి కాలనీ వాసులను విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌళిక సదుపాయాల విషయంలో ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. చిత్రపురికాలనీ హౌసింగ్ సొసైటీపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. సొసైటీపై ఇప్పటికే 21 కేసులు కోర్టులో ఉన్నాయని, ఎంతో మంది అధికారులు విచారణ జరిపినా ఎక్కడా అవినీతి జరగలేదని తేల్చారు. ప్రస్తుతం చిత్రపురిలో ఎంఐజీ, డూప్లెక్స్, రో హౌస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎంఐజీలో ఐదు బ్లాకుల్లో రెండు బ్లాకులు పూర్తయ్యాయి. మరో మూడు తుది దశ పనుల్లో ఉన్నాయి. ఈ పనులు మరో 6 నెలల్లో పూర్తవుతాయి. ఈ పనులు జరుగుతుండగానే నిర్మాతలకు సంబంధించిన మూవీ టవర్స్ లోని అవినీతి బయటకురాకూడదనే ఉద్దేశంతోనే తరుచూ చిత్రపురికాలనీలో వందల కోట్ల అవినీతి జరిగిదంటూ కొంత మంది చేత ప్రచారం చేయిస్తున్నారు. వాళ్లకు కేటాయించిన ఫ్లాట్స్ అమ్ముకుని మళ్లీ కావాలని ధర్నాలు అంటూ బ్లాక్ మెయిల్స్ చేస్తున్నారు. సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు స్వార్థంతో వాళ్ల వెనక ఉండి ఈ గొడవలు పెట్టిస్తున్నారు. గత పాలక మండలి అడ్వాన్సులు చెల్లించిన కంపెనీల నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు లోబడే చిత్రపురి కాలనీలో చిత్రపురి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేశాం. సినీ కార్మికుల సంక్షేమం కోసం నిర్మిస్తున్న చిత్రపురికాలనీ పూర్తి కాకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు. వచ్చే రెండు మాసాల్లో 430 మంది సినీ కార్మికులకు సింగిల్, డబుల్, ట్రిబుల్ బెడ్ రూమ్ లను కేటాయించబోతున్నాం. తుది దశలో ఉన్న చిత్రపురి కాలనీ నిర్మాణ ఈ క్రమంలో చిత్రపురి కాలనీకి అవినీతి మరక అంటించి సినీ కార్మికులు బయట తిరగలేని పరిస్థితి తీసుకొస్తున్నారు. ఆరోపణలు చేస్తే వ్యక్తులు సొసైటీకి నిధుల సేకరణ, సభ్యుల సంక్షేమం కోసం పాటుపడతామంటే తమ కమిటీ సత్వరమే రాజీనామా చేస్తాం. అలాగే కార్మికుల సంక్షేమం కోసం చిత్రపురి కాలనీలో మెగాస్టార్ చిరంజీవి గారు నిర్మించనున్న ఆస్పత్రి నిర్మాణ కోఆర్డినేషన్ కోసం ప్రత్యేక కమిటీ వేశాం. అన్నారు.

Facebook Comments
Don't hinder development works in Chitrapuri colony: President Anil Kumar Vallabhaneni

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: