Social News XYZ     

Abhinav Gomatam To Be Introduced As A Hero

హీరోగా మారుతున్న నటుడు అభినవ్ గోమఠం !!!

మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు* వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఓ కొత్త దర్శకుడు దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

 

జనవరి ఒకటో తేదీ అభినవ్ గోమఠం పుట్టిన రోజు సందర్భంగా సినిమా గురించి ప్రకటన చేశామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది చిత్రయూనిట్.

Facebook Comments
Abhinav Gomatam To Be Introduced As A Hero

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.