Social News XYZ     

Roopa Koduvayur Is The Leading Lady In Sohel’s Debut Film

మైక్ మూవీస్ చిత్రంలో సొహైల్ జోడీగా రూప కొడువయూర్

"ఉమామహేశ్వర ఉగ్రరూపస్య" చిత్రంతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నాయిక రూప కొడువయూర్ బిగ్ బాస్ ఫేం సొహైల్ హీరోగా నటిస్తున్న మూవీ లో హీరోియన్ గా కనిపించనుంది. మైక్ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్న ఈ సినిమాలో నాయికగా రూప కొడువయూర్ ఎంపికైంది. హోలీ పండగ సందర్భంగా దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇటీవలే మైక్ మూవీస్, సొహైల్ కాంబినేషన్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

"జార్జ్ రెడ్డి", "ప్రెజర్ కుక్కర్" లాంటి సినిమాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మైక్ మూవీస్ మరో వినూత్న కథతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. ఇవాళ్టి సొసైటీలో ఓ బర్నింగ్ ఇష్యూను కథలో చూపించబోతున్నారు. ప్రతి మహిళ గర్వపడే విధంగా సినిమా ఉంటుందని హీరో సొహైల్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పారు. ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు గతంలో తెలిపారు. నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రంలోని ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు.

 

సయ్యద్ సోహైల్ రియాన్, రూప కొడువయూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ : శ్రావణ్ భరధ్వాజ్, సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ, ఆర్ట్: గాంధీ నడికుడికార్, నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, రచన,దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి

Facebook Comments

%d bloggers like this: