టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో అనగనగా ఓ అతిధి
ఆహాలో యాప్ లో నవంబర్ 20న విడుదల అవ్వబోతున్న అనగనగా ఓ అతిధి
ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతకాం పై టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం అనగనగా ఓ అతిధి. ఈ సినిమాలో పాయల్ తో పాటు యువ కథనాయకుడు చైతన్య కృష్ణ, నటులు ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్ తదితరలు కీలక పాత్రల్లో నటించారు. దయాల్ పద్మనాభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని రాజా రామ్ మూర్తి, చిదంబరం నటీసన్ నిర్మించారు.
అనుకోని పరిస్థితుల్లో ఓ అర్ధరాత్రి ఓ ఇంటికి వచ్చిన అతిధి కారణంగా ఎదురైయ్యే సమస్యలు కథాంశంగా ఈ సినిమాను దర్శకుడు దయాల్ అత్యంత ఉత్కంఠ కలిగేలా రూపొందిచారు. ఆరెక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ హిట్, ఆర్ డి ఎక్స్ లవ్, డిస్కోరాజా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ సోంత ఇమేజ్ తెచ్చుకున్న పాయల్ ఇప్పుడు అనగనగా ఓ అతిధితో మరోసారి ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ స్లేట్ లో ప్రముఖ తెలుగు ఓటిటి ఆహాలో నవంబర్ 20న విడుదల అవుతుంది.
నటీనటులు - పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్
దర్శకుడు - దాయల్ పద్మనాభన్
ప్రొడక్షన్ హౌస్ - ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రాఫర్ - రాకేష్ బి
ప్రొడ్యూసర్స్ - రాజా రామామూర్తి, చిందబర్ నటీశన్
మ్యూజిక్ డైరెక్టర్ - ఆరోల్ కోరెల్లి
రైటర్ - కాశీ నదీంపల్లి
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.