Social News XYZ     

Doing a police officer role in my first film is very thrilling: 22 movie hero Rupesh Kumar Choudhary

నా తొలి చిత్రంలోనే పోలీస్‌ ఆఫీసర్‌ గా నటించే అవకాశం రావడం ఎంతో థ్రిల్లింగ్‌ గా ఉంది
- '22 'హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి.

సినిమాల్లోకి రావాలని, గొప్పగా రాణించాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే వాటిని సాధించేది మాత్రం కొందరే... ఆ కొందరిలాగానే పట్టుదలగా ఆ కలలను నిజం చేసుకున్నారు హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి. తనకెంతో ఇష్టమైన పోలీస్‌ ఆఫీసర్‌గా తొలి సినిమాలో నటిస్తున్నారు. తన ఆరాధ్య నటుడు విక్టరీ వెంకటేశ్‌ క్లాప్‌తోనే సినిమా ప్రారంభం కావడంతో మరింత ఉత్సాహనిచ్చిందని అంటున్నారు హీరో రూపేశ్‌ కుమార్‌ చౌదరి. ఈయన హీరోగా మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై శివకుమార్‌ బి. దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ '22'. సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్‌ 2న ఈ చిత్రం హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగిన ఇంటర్వ్యూలో హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి మాట్లాడుతూ..

మీ నేపథ్యం గురించి?
- మాది బిజినెస్‌ ఫ్యామిలీ. నేను కూడా మా నాన్నగారికి సపోర్ట్‌గా ఉండి బిజినెస్‌ చూసుకునేవాడ్ని. కానీ నాకు యాక్టింగ్‌ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ కుదరలేదు. ఆ ప్రాసెస్‌లో ఆనీ మాస్టర్‌ శివగారిని పరిచయం చేశారు. అలా ఇద్దరం కలిసి ఒక వెబ్‌ సిరీస్‌ చేశాం. అది ఇప్పుడు బిజినెస్‌ ప్రాసెస్‌లో ఉంది. ఆ వెబ్‌ సిరీస్‌ తర్వాత సినిమా కూడా చేయగలనన్న కాన్ఫిడెన్స్‌ రావడంతో డిస్కస్‌ చేసుకుని ఈ సినిమా స్టార్ట్‌ చేశాం..

 

షూటింగ్‌ ఎలా జరుగుతోంది?
- చాలా బాగా జరుగుతోంది. ప్రస్తుతం కొన్ని ఛేజింగ్‌ సీన్స్‌ చేస్తున్నాం.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ గురించి చెప్పండి?
- నేను రుద్ర అనే ఇన్‌స్పెక్టర్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుండి పోలీస్‌ రోల్‌ అంటే చాలా ఇష్టం. ఆ అవకాశం నాకు ఫస్ట్‌ సినిమాకే వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. శివగారు తనెంతో నమ్మి రాసుకున్న స్టోరిని నాకు ఇచ్చినందుకు ఆయనకి థాంక్స్‌. ఆ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేస్తానని అనుకుంటున్నాను.

పోలీస్‌ క్యారెక్టర్‌ అంటే ఇష్టం అన్నారు కదా! దానికి ఏమైనా ఇన్‌స్పిరేషన్‌ ఉందా?
- నార్మల్‌గానే నాకు పోలీసులంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడు ఆ ఇష్టం మరింత పెరిగింది. 'టెంపర్‌' మూవీలో ఎన్టీఆర్‌గారు పోషించిన క్యారెక్టర్‌ అంటే చాలా ఇష్టం. ఆ పాత్రకి ఆయన ప్రాణం పోశారు. అలాగే పవర్‌స్టార్‌ 'గబ్బర్‌సింగ్‌'తో పాటు కొన్ని క్యారెక్టర్స్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాను.

పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ తీసుకున్నారా?
- చిన్నప్పటి నుండి నాకు జిమ్‌ చేసే అలవాటు లేదు. నార్మల్‌గా వాకింగ్‌, యోగా చేసేవాడ్ని. నాలుగైదు నెలలుగా ఈ క్యారెక్టర్‌ కోసం రెగ్యులర్‌గా జిమ్‌ చేస్తున్నాను. అలాగే డ్యాన్స్‌లు, ఫైట్స్‌ కూడా ప్రాక్టీస్‌ చేశా.

యాక్టింగ్‌లో ఎవరిదగ్గరైనా శిక్షణ తీసుకున్నారా?
- ఎంతోమంది స్టార్‌ హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చిన వైజాగ్‌ సత్యానంద్‌గారి వద్ద రెండు సంవత్సరాలు యాక్టింగ్‌లో శిక్షణ పొందాను. ఇప్పుడు ఈ పోలీస్‌ క్యారెక్టర్‌ కోసం బాలుగారి వద్ద శిక్షణ తీసుకుంటున్నాను.

శివ దర్శకత్వం గురించి?
- చాలా బాగుంది. ఒక డైరెక్టర్‌గానే కాకుండా ఒక ఫ్రెండ్‌లా, బ్రదర్‌లా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. స్క్రిప్ట్‌మీద ఆయనకి చాలా క్లారిటీ ఉంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మా యూనిట్‌ పడుతున్న కష్టం రేపు సినిమా రిలీజయ్యాక ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.

మీరు వెంకటేష్‌ ఫ్యాన్‌ అని చెప్పారు కదా? మీ చిత్రం ప్రారంభోత్సవానికి ఆయన క్లాప్‌ కొట్టడం మీకెలా అన్పించింది?
- అంతకు ముందు రోజు బి.ఎ.రాజుగారు ఫోన్‌ చేసి, రేపు క్లాప్‌ కొట్టడానికి వెంకటేష్‌గారు వస్తున్నారు అని చెప్పారు. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. నా తొలి చిత్రానికే విక్టరీ వెంకటేష్‌లాంటి స్టార్‌ హీరో క్లాప్‌ కొట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఆ వేడుకకి హీరో సాయితేజ్‌తో పాటు అంతమంది గెస్ట్‌లు వచ్చి మా యూనిట్‌కి బ్లెస్సింగ్స్‌ ఇవ్వడం నిజంగా మా అదృష్టం. అందుకు నేను బి.ఎ.రాజుగారికి ప్రత్యేకంగా థాంక్స్‌ తెలియజేస్తున్నాను.

'22' టైటిల్‌ గురించి?
- ఈ సినిమా కథ అంతా 22 మీదే రన్‌ అవుతుంది. చాలా ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉంటాయి. అవి ఇప్పుడే రివీల్‌ చేస్తే ఆ థ్రిల్‌ ఉండదు. సినిమా చూస్తున్నప్పుడే దాన్ని ఎంజాయ్‌ చెయ్యాలి.

హీరోయిన్‌, మిగతా ఆర్టిస్ట్‌ల గురించి?
- 'ఫలక్‌నుమాదాస్‌' చిత్రంలో నటించిన సలోని మిశ్రా మా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే 'హార్ట్‌ ఎటాక్‌' విలన్‌ విక్రమ్‌జిత్‌ విలన్‌గా నటిస్తున్నారు. జయప్రకాష్‌, రాజేశ్వరి నాయర్‌, పూజ రామచంద్రన్‌, రవివర్మ ఇలా మంచి పేరున్న ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.

ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ గురించి?
- 'ఖైది నంబర్‌ 150', 'బాహుబలి', 'సాహో' వంటి చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన జాషువా మాస్టర్‌ ఈ సినిమాలో కథకి అనుగుణంగా అత్యద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ కంపోజ్‌ చేస్తున్నారు. ఆ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం కుంగ్‌ఫూ, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను.

కొత్త కథలేమైనా వింటున్నారా?
- లేదండీ...నా ఫుల్‌ ఫోకస్‌ '22' పైనే ఉంది. పూర్తి స్థాయిలో కాన్‌సన్‌ట్రేషన్‌తో ఉన్నాను. అసలు మరో కథ, సినిమాలు ఇలాంటి ఆలోచనలే లేవు. మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలనేదే నా కోరిక అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి.

Facebook Comments
Doing a police officer role in my first film is very thrilling: 22 movie hero Rupesh Kumar Choudhary

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: