Social News XYZ     

Don’t vote for conjuse Naga Babu: Sivaji Raja

పిల్లి కి బిచ్చం పెట్టని నాగబాబు కి ఓటు వెయ్యొద్దు.... శివాజీరాజా

Don't vote for conjuse Naga Babu: Sivaji Raja

Don’t vote for conjuse Naga Babu: Sivaji Raja (Photo:SocialNews.XYZ)

గెలుపు ఓటమిలనేవి ఎవరికైనా సహజం. మా అసోసియేషన్ ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆరు వందలకు పైగా మెంబెర్స్ ఉన్న మా అసోసియేషన్ కే నాగబాబు ఏమి చెయ్యలేదు నర్సాపురం కి ఏమి చేస్తాడని శివాజీరాజా అన్నారు.

 

ఇటీవలే జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ప్రెస్మీట్ పెట్టిమరీ శివాజీరాజా ని విమర్శించారు నాగబాబు. జీవిత రాజశేఖర్ లు ఉన్న నరేష్ ప్యానెల్ ను గెలిపించాలని కోరారు. దీనికి కౌంటర్ గా రిటర్న్ గిఫ్ట్ సమాధానం గా శివాజీరాజా ఆదివారం హోటల్ ఉలవచ్చారులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా తో ఆయన మాట్లాడుతూ... చిరంజీవి గారు నాకు 30 ఏళ్ల నుంచీ నాకు తెలుసు. ఆయన మా లాంటి వారందరికీ ఆదర్శం. ఆయన నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య. ఆయన్ని మేము దేవుడు లాగా కొలుస్తాము. పవన్ కళ్యాణ్ అన్నా కూడా నాకు చాలా అభిమానం. ఆయనలో ఒక విజన్ ఉంది, ఒక డేర్ ఉంది. వీరిద్దరి మధ్య పుట్టిన నాగబాబు కి ఏ విజన్ లేదు. ఏ రకంగాను ఆదర్శంగా తీసుకోడానికి పనికిరాడు. నేను సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. అతను అలా కాదు. ఏ రకంగా నర్సాపురం వెళ్లి ఓట్లు అడుగుతాడు అని ధ్వజమెత్తారు. నువ్వు ఎవరినైతే నా వాళ్ళు అని గెలిపించావో ఈ రోజు వాళ్ళు నిన్ను , ని పార్టీ ని ఏమంటున్నారు. 30 ఏళ్ళ నుంచి మెగాస్టార్ ని మిమ్మల్ని నమ్మిన మేము పరాయివాళ్ళం అయిపోయామా!

600 మంది ఉన్న మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే మా అసోసియేషన్ కు ఏమి చెయ్యలేదు. లక్షలాది ప్రజాలున్న నర్సాపురానికి ఏమి చేస్తావు. ఏనాడైనా నర్సాపురం వెళ్ళారా కనీసం దాని బోర్డర్స్ తెలుసా. ఏనాడైనా అక్కడి ప్రజలకు ఏదైనా చేసారా. పిల్లి కి బిచ్చమ్ కూడా పెట్టని నువ్వు ఏ విధంగా అక్కడ కు వెళ్లి ప్రజల్ని ఓట్ వేయమని అడుగుతున్నావ్ అని అన్నారు. నీ ప్రసంఘాలన్నీ వింటున్నాం కులాలను రెచ్చగొట్టేవిధంగా ఎందుకు మాట్లాడుతున్నావ్. నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. అంతే కానీ కులాలను రేచ్చగొట్టొద్దు అని అన్నారు.

Facebook Comments

%d bloggers like this: