Social News XYZ     

Bigg Boss Nutan Naidu gets a key role in Sundeep Kishan’s movie

బిగ్ బాస్ నూతన్ నాయుడికి మరో ఆఫర్ !.

Bigg Boss Nutan Naidu gets a key role in Sundeep Kishan's movie

బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నూతన్ నాయుడు ఇటీవల ఎఫ్ 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు నూతన్ సందీప్ కిషన్ సినిమాలో నటించబోతున్నాడు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో నూతన్ నాయుడు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

 

హన్సిక హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్నూల్ లో జరుగుతోంది. సందీప్ కిషన్ ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కామిడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నూతన్ పాత్ర ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.

తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. రాజసింహ కథ అంచినా ఈ సినిమాకు భవాని ప్రసాద్, నివాస్ మాటలు రాస్తుండగా గోపాల్ కృష్ణ, విక్రమ్ రాజ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు.

Facebook Comments

%d bloggers like this: