Social News XYZ     

Sai Pallavi comes of her high horse

సాయి పల్లవిలో మార్పు !

Sai Pallavi comes of her high horse

సాయి పల్లవి నటించిన సినిమాలు ఇటీవల పెద్దగా సక్సెస్ కాలేదు. నాగ శౌర్య కణం, శర్వానంద్ పడి పడిలేచే మనసు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుచేత సాయి పల్లవి జాగ్రత్తగా సినిమాలు సైన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

 

ఇదివరుకు కోటి కావాలని డిమాండ్ చేసే సాయి పల్లవి ఇప్పుడు స్క్రిప్ట్ బాగుంటే చాలు అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మంచి కథ వస్తే లేడి ఓరియంటెడ్ సినిమా చెయ్యడానికి తను రెడీగా ఉన్నట్లు సమాచారం.

ఫ్లాప్స్ పడడంతో ఈ హీరోయిన్ లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ వేణు ఉడుగుల దర్శకత్వంలో ఒక లేడి ఓరియంటెడ్ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంది. త్వరలో మొదలయ్యే ఈ సినిమాలో రానా హీరోగా నటించబోతున్నాడు. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Facebook Comments

%d bloggers like this: