Social News XYZ     

Sai Dharam Tej’s next with hit director G. Ashok!!

హిట్ దర్శకుడితో మెగా హీరో సినిమా !

Sai Dharam Tej's next with hit director G. Ashok!!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రాలహరి అనే సినిమా చేస్తున్నాడు. లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమా తరువాత సాయి ధరమ్ అశోక్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. పిల్ల జమీందార్, భగుమతి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అశోక్ ఈ మెగా హీరోతో సినిమా చెయ్యబోతుండడం విశేషం. మహేశ్ బాబు సిస్టర్ మంజుల ఈ సినిమాను నిర్మించబోతోంది.

వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సాయి ధరమ్ కొంత గ్యాప్ తీసుకొని కథలు ఓకే చేస్తున్నాడు. దర్శకుడు అశోక్ సినిమా గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. థ్రిల్లర్ నేపద్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం.

Facebook Comments