ఆర్.ఆర్.ఆర్ కు కొత్త టైటిల్ !.
రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్‌టిఆర్ నటిస్తున్న సినిమాకు రామ. రావణ రాజ్యం టైటిల్ ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ టైటిల్ లో వాస్తవం లేదని చిత్ర వర్గాల నుండి తెలిసింది. మరి ఈ సినిమాకు టైటిల్ ఎంటనేసందేహం మళ్ళీ అందరికి మొదలయ్యింది.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు రాజసం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సింపుల్ గా ఉండే ఈ టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 19 నుండి ప్రారంభం కానుంది.
సెందిల్ కామెరామెన్ గా పని చేస్తున్న ఈ సినిమాకు బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. గత జన్మల నేపద్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరనేది త్వరలో క్లారిటీ రానుంది. మూడో షెడ్యూల్ నుండి హీరోయిన్స్ జాయిన్ కాబోతున్నారు.
