Social News XYZ     

Vijay Devarakonda’s Taxiwaala is getting a negative feedback

విజయ్ దేవరకొండ సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ !

Vijay Devarakonda's Taxiwaala is getting a negative feedback

నోటా సినిమా ఫ్లాప్ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'టాక్సీవాలా' సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది నిన్న (ఆదివారం ) ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన ఈ ఫంక్షన్ కు పలువులు డైరెక్టర్స్ ఈ వేడుకకు హాజరు అయ్యారు. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. కొందరు ఆకతాయిలు ఈ సినిమాను పైరసీ చేయడంతో సినిమాను చాలామంది చూశారు. సినిమా చూసిన వారు పెద్దగా ఏమీ లేదని, కారులో ఉన్న దెయ్యం అందరితోనూ ఆడుకుంటుందని, ఇది రెగ్యులర్ హర్రర్ సినిమా అంటున్నారు.

 

విడుదలకు ముందు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్న ఈ సినిమా రిలీస్ తరువాత ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్కూడా పెద్దగా ఇంప్రెసివ్ గా లేదు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ రెండు సినిమాలు చేస్తున్నాడు. నూతన దర్శకుడు భారత్ కమ్మ తో ఒక సినిమా, క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ఒక సినిమా ఉంది. తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ క్రేజ్ ను నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

Facebook Comments

%d bloggers like this: