Social News XYZ     

Amar Akbar Anthony movie carrying positive report

శ్రీనువైట్ల రూటు మార్చాడు !

Amar Akbar Anthony movie carrying positive report

రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర సెన్సర్ కార్యక్రమాలు ఈరోజు (సోమవారం) పూర్తి అయ్యాయి. సెన్సర్ నుండి యు/ఏ సట్టిఫికేట్ పొందిన ఈ సినిమా కు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తన గత చిత్రాల తరహాలో కాకుండా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడాని సమాచారం. కథ పరంగా రెగ్యులర్ రివేంజ్ డ్రామ అయినప్పటికి విజువల్స్, టేకింగ్ డిఫరెంట్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

 

ఇలియానా గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. సునిల్ ఈ చిత్రంలో పూర్తి స్థాయిలో ప్రేక్షకులను నవ్వించబోతున్నాడని అంటున్నారు. శ్రీనువైట్ల వరుస ఫ్లాప్స్ తరువాత ఈ సినిమాతో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ తరువాత టచ్ చేసి చూడు, నేల టికెట్ పెద్దగా సక్సెస్ కాలేదు, ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కే అవకాశాలు ఉన్నట్లు ఇంసైడ్ టాక్. రవితేజ ఈ సినిమా తరువాత సంతోష్ శ్రీనివాస్ తో, విఐ.ఆనంద్ తో సినిమాలు చెయ్యబోతున్నాడు.

Facebook Comments

%d bloggers like this: