Social News XYZ     

Samantha to do a movie for Suresh Productions

సురేష్ ప్రొడక్షన్ లో సమంత !

Samantha to do a movie for Suresh Productions

పెళ్లి తరువాత సమంత చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. హీరోల పక్కన రొమాన్స్ చేసే పాత్రలు కాకుండా లేడి ఓరియంటెడ్ పాత్రలు చేసుకుంటూ వెళ్తోంది. ఈ మధ్య సమంత నటించిన యుటర్న్ సినిమా పరువాలేదు అనిపించుకుంది. అదే తరహాలో సమంత మరో లేడి ఓరియంటెడ్ సినిమా చెయ్యబోతోంది. లేడి డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు.

 

ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఈ మూవీని నిర్మించబోతున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2014లో రిలీజ్‌ అయిన కొరియన్‌ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత పాత్ర కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు చైతు సరసన ఒక సినిమా చెయ్యడానికి అంగీకరించింది. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో సమంత నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి ఆఫీషియల్ న్యూస్ లేదు.

Facebook Comments

%d bloggers like this: