Social News XYZ     

Rukshar Dhillon bags the lead role in Allu Sirish’s ABCD Telugu remake

అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా  రుక్షార్ థిల్లాన్

Rukshar Dhillon bags the lead role in Allu Sirish's ABCD Telugu remake

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించగా... సూపర్ డూపర్ హిట్టయిన ఎబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ డ్ దేసి ) చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన నటించే లక్కీ ఛాన్స్ రుక్షార్ థిల్లాన్ సొంతం చేసుకుంది. కృష్ణార్జున యుద్ధం చిత్రంతో రుక్షార్ అందరి హృదయాల్ని దోచేసింది. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా

 

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అల్లు శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ధం ఫేం రుక్షార్ థిల్లాన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశాం. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

నటీనటులు
అల్లు శిరీష్, రుక్షార్ థిల్లాన్

సాంకేతిక వర్గం
మ్యూజిక్ డైరెక్టర్ - జుధా సాంధీ
కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
బ్యానర్స్ - మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు - మధుర శ్రీధర్, యష్ రంగినేని
దర్శకుడు - సంజీవ్ రెడ్డి

Facebook Comments
Rukshar Dhillon bags the lead role in Allu Sirish's ABCD Telugu remake

About uma