Social News XYZ     

Moodu Puvvulu Aaru Kayalu movie title announced

ర‌చ‌యిత రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో
`మూడు పువ్వులు ఆరు కాయ‌లు`!   

Moodu Puvvulu Aaru Kayalu movie title announced`ప్రేమ గొప్ప‌దే.. జీవిత ల‌క్ష్యం ఇంకా గొప్ప‌ది. ప్రేమంటే చంప‌ట‌మో చావ‌ట‌మో కాదు, చ‌చ్చేదాకా క‌లిసి బ్ర‌త‌క‌టం.  క‌న్న‌వాళ్ల క‌ల‌ల‌తో పాటు, ఆశించిన‌  ల‌క్ష్యాన్ని చేరుకోగ‌లిగితే ప్ర‌తి ఒక్క‌రి జీవితం మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా వ‌ర్ధిల్లుతుంది`` అనే క‌థాంశంతో స్మైల్ పిక్చ‌ర్స్ ఓ సినిమాను తెర‌కెక్కిస్తోంది. దాదాపు 40 చిత్రాల‌కు పైగా సంభాష‌ణల ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ చిత్రానికి మూడు పువ్వులు ఆరు కాయ‌లు అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు.  షూటింగ్ పూర్తయింది. అర్జున్ య‌జ‌త్‌, భ‌ర‌త్ బండారు, రామ‌స్వామి హీరోలుగా న‌టించారు.  సౌమ్య వేణుగోపాల్, పావ‌ని, సీమా చౌద‌రి నాయిక‌లు. డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస‌రావు స‌మ‌ర్పిస్తున్నారు. వ‌బ్బిన వెంక‌ట‌రావు నిర్మాత‌.  ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ న‌వ్వినా ఏడ్చినా క‌న్నీళ్లే వ‌స్తాయి. ఈ చిత్రంలో క‌డుపుబ్బా న‌వ్వించే హ‌స్య‌ర‌సంతో పాటు, కంట‌త‌డి పెట్టించే క‌రుణ‌ర‌సం కూడా ఉంటుంది. దాదాపు న‌ల‌భై చిత్రాల‌కు పైగా మాట‌ల ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రామ‌స్వామి మొద‌టిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు అని చెప్పారు.

 

షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి అని స‌మ‌ర్ప‌కుడు డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస‌రావు అన్నారు. చాలా చిత్రాల‌కు మాట‌ల ర‌చ‌యిత‌గా ప‌నిచేశాను. ద‌ర్శ‌కుడిగా ఇదే నా తొలి చిత్రం. మంచి కాన్సెప్ట్ తో స‌కుటుంబాన్ని అల‌రించేలా తెర‌కెక్కించాను అని ద‌ర్శ‌కుడు తెలిపారు.

అర్జున్ య‌జ‌త్‌, భ‌ర‌త్ బండారు, రామ‌స్వామి, సౌమ్య వేణుగోపాల్, పావ‌ని, సీమా చౌద‌రి, త‌నికెళ్ల భ‌ర‌ణి, కృష్ణ భ‌గ‌వాన్‌, పృథ్వి, అజయ్ ఘోష్‌, బాలాజీ, డా. మ‌ల్లె శ్రీనివాస‌రావు, రాకెట్ రాఘ‌వ‌, జ‌బ‌ర్ద‌స్త్ ఆటో రామ్‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు సాహిత్యం: చంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల,  ఫైట్స్:  మార్ష‌ల్ ర‌మ‌ణ‌, ఎడిటింగ్‌: ఉపేంద్ర‌, కెమెరా: ఎం.మోహ‌న్ చంద్‌, ఆర్ట్:  కె.వి.ర‌మ‌ణ‌, సంగీతం:  కృష్ణ సాయి, నిర్మాత‌: వ‌బ్బిన వెంక‌ట రావు, క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం:  రామ‌స్వామి.

Facebook Comments
Moodu Puvvulu Aaru Kayalu movie title announced

About uma

%d bloggers like this: