Social News XYZ     

Saptagiri LLB proved again good content will always be appreciated: Producer Dr.Ravi Kiran

కంటెంట్‌ని నమ్ముకుని సినిమా తీస్తే ఆదరిస్తారని 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'తో ప్రేక్షకులు మరోసారి నిజం చేశారు
- నిర్మాత డా. రవికిరణ్‌ 

Saptagiri LLB proved again good content will always be appreciated: Producer Dr.Ravi Kiran

కామెడీ కింగ్‌ సప్తగిరి హీరోగా కశిష్‌ వోరా హీరోయిన్‌గా చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో సాయిసెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై అభిరుచిగల నిర్మాత డా. రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. ఈ చిత్రం డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజై సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా పరుగులు తీస్తుంది. రైతులు బతకాలి. అందరికీ సమానమైన న్యాయం దక్కాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సాయికుమార్‌, శివప్రసాద్‌, సప్తగిరి పోటాపోటీగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చరణ్‌ అద్భుతమైన టేకింగ్‌తో ప్రజెంట్‌ చేశారు. పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌, నిర్మాత రవికిరణ్‌ మేకింగ్‌ వేల్యూస్‌ ప్రధాన ఎస్సెట్‌గా నిలిచాయి. కాగా ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని డిసెంబర్‌ 9న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరి, హీరోయిన్‌ కశిష్‌ వోరా, స్టార్‌ రైటర్స్‌ పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు చరణ్‌ లక్కాకుల, ఎడిటర్‌ గౌతంరాజు, నిర్మాత డా. రవికిరణ్‌ పాల్గొన్నారు.

 

హీరో సప్తగిరి మాట్లాడుతూ - ''సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' చిత్రాన్ని మౌత్‌ టాక్‌తో సూపర్‌హిట్‌ చేశారు. ఈ సినిమాకి మీడియా చేసిన సపోర్ట్‌ ఎంతో హెల్ప్‌ అయ్యింది. ఎంతో గొప్పగా ప్రజల్లోకి మా సినిమాని తీసుకెళ్ళారు. అలాగే బి.ఎ.రాజుగారు సినిమా స్టార్టింగ్‌ నుండి ఎంతో ఎంకరేజ్‌ చేస్తూ మాలో కాన్ఫిడెన్స్‌ని మరింత పెంచారు. లైఫ్‌లాంగ్‌ ఆయనతో నా జర్నీ కొనసాగిస్తాను. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కామన్‌ ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. లాస్ట్‌ నలభై ఐదు నిమిషాలు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుని చూస్తున్నారు. పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌కి క్లాప్స్‌, విజిల్స్‌ పడుతున్నాయి. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం వారే. అలాగే సినిమాని తన అద్భుతమైన ఎడిటింగ్‌తో అందంగా ప్రజెంట్‌ చేసిన గౌతంరాజుగారు ఒన్‌ ఆఫ్‌ ది ఎస్సెట్‌ అని చెప్పాలి. ఆయనకి నా థాంక్స్‌. డైరెక్టర్‌ ఇరవై ఐదు సంవత్సరాలుగా కో-డైరెక్టర్‌గా చేసి ఎన్నో కష్టాలు పడి ఓర్పు, సహనంతో ఈ సినిమా చేశాడు. ఆయన క్యారెక్టర్‌ని నమ్మి అవకాశం ఇచ్చాను. నాలో వున్న పెర్‌ఫార్మెన్స్‌ని ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకున్నారు. ఇది డైరెక్టర్‌ చరణ్‌ విజయం. ఒక గొప్ప సినిమాని విజయాన్ని నాకు ఇచ్చారు. ఆయనతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తాను. కంటెంట్‌ బాగుంటే సినిమా ఆడుతుంది అని నమ్మి మా ప్రొడ్యూసర్‌ రవికిరణ్‌గారు ఈ సినిమాని నిర్మించారు. ఆయన నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్‌. ఇంత మంచి సినిమాని నాతో చేసిన రవికిరణ్‌గారికి థాంక్స్‌. ఆయన ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలి. హీరోగా నన్ను బాగా ఎంకరేజ్‌ చేసి నాతో రెండు సినిమాలు చేశారు. ఈ సినిమా సక్సెస్‌తో పెద్ద పెద్ద డైరెక్టర్స్‌ నుండి ఆఫర్స్‌ వస్తున్నాయి'' అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ''బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు లాగా ఇక్కడ మన సమాజాన్ని కాపాడాలి. రాజకీయ నాయకులు చట్టం, న్యాయం మనల్ని కాపాడే దానవులు. వీళ్ల ముగ్గురు సరిగా పనిచేయకపోతే ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. న్యాయం ప్రతి ఒక్కరికీ దక్కాలి. రైతులు బ్రతకాలి అనే చక్కని మెసేజ్‌తో సినిమా చేశారు. ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్‌ చేశారు. సాయికుమార్‌, శివప్రసాద్‌గారు అత్యద్భుతంగా చేశారు. వారికి ధీటుగా సప్తగిరి నటించాడు. గొల్లపూడి మారుతీరావుగారు కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌ రెడ్డి, ఎల్‌.బి.శ్రీరామ్‌ ఎంతో మంది ఆర్టిస్ట్‌ల్ని పెట్టి పాత్రలు చిన్నవి అయినా సినిమా తీసిన నిర్మాత రవికిరణ్‌కి నా హ్యాట్సాఫ్‌. ఈ సినిమాతో మా చరణ్‌ దర్శకుడిగా సక్సెస్‌ అయినందుకు నాకు చాలా ఆనందంగా వుంది'' అన్నారు.

సప్తగిరిలో ఫుల్‌ ఎనర్జీ వుంది!!
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''సప్తగిరి, రవికిరణ్‌ ఇద్దరూ 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'తో సూపర్‌హిట్‌ కొట్టారు. మళ్లీ వారి కాంబినేషన్‌లో 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' సక్సెస్‌ అయ్యింది. నిర్మాత రవికిరణ్‌గారికి సినిమాల పట్ల మంచి అవగాహన వుంది. అలాగే మంచి లక్‌ కూడా వుంది. కథల పట్ల మంచి టేస్ట్‌ వుంది. అందుకే రెండు సూపర్‌హిట్‌ సినిమాలు తియ్యగలిగాడు. సాయికుమార్‌, శివప్రసాద్‌, సప్తగిరి ముగ్గురూ పోటాపోటీగా ఈ చిత్రంలో నటించారు. సప్తగిరి పోరాటంతో న్యాయాన్ని గెలిపించాడు. అతనిలో ఒక ఎనర్జీ వుంది. ఈ చిత్రంతో ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ ఆర్టిస్ట్‌గా నిరూపించుకున్నాడు. అతనికి ఇంకా మంచి భవిష్యత్తు వుండాలని కోరుకుంటున్నాను. మా శిష్యుడు చరణ్‌ ఎప్పట్నుంచో మాతో ట్రావెల్‌ అవుతున్నాడు. ఎంతో కష్టపడి ఈ సినిమా తీసి తానేంటో నిరూపించుకున్నాడు. మంచి హిట్‌ సినిమా తీసినందుకు చరణ్‌ని అభినందిస్తున్నాను. ఈ చిత్రాన్ని అఖండ విజయం చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు'' అన్నారు.

దర్శకుడు చరణ్‌ లక్కాకుల మాట్లాడుతూ - ''రిలీజ్‌ రోజు మెయిన్‌ థియేటర్‌ సంధ్యలో ఆడియన్స్‌ మధ్య ఈ సినిమా చూశాను. సినిమా స్టార్టింగ్‌ నుండి ప్రేక్షకులు విజిల్స్‌, క్లాప్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా అద్భుతంగా వుంది. చాలా బాగా చేశారు అని ప్రేక్షకులు అభినందించారు. అలాగే ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్‌, వెల్‌ విషర్స్‌ ఫోన్‌ చేసి చాలా మంచి సినిమా తీశావ్‌. చాలా బాగుంది పెద్ద డైరెక్టర్‌లా తీశావ్‌ అని అప్రిషియేట్‌ చేస్తుంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని భావించాను. మా పరుచూరి బ్రదర్స్‌ ఫెంటాస్టిక్‌ డైలాగ్స్‌ రాశారు. సాయికుమార్‌, శివప్రసాద్‌, సప్తగిరి పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకి చాలా ప్లస్‌ అయ్యింది. ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా చేశారు. మాస్‌ హీరోస్‌లో వుండే క్వాలిటీస్‌ అన్నీ సప్తగిరిలో వున్నాయి. అన్ని ఏరియాల నుండి ప్రతి ఒక్కరూ ఫోన్‌ చేసి అభినందిస్తుంటే చాలా ఆనందంగా వుంది. మా సినిమాని పెద్ద సక్సెస్‌ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను'' అన్నారు.

చిత్ర నిర్మాత డా. రవికిరణ్‌ మాట్లాడుతూ - ''కంటెంట్‌ని నమ్ముకుని సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఈ సినిమా తీశాం. ఈ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేసి నా నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేసినందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. ఒక కంటెంట్‌, మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాకి ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియా ఎంత సపోర్ట్‌ చేస్తుంది అనడానికి ఈ సినిమా నిదర్శనం. విలేజ్‌లో, సిటీలో ఈ సినిమా ఆడియన్స్‌ మధ్య చూశాను. ఎక్స్‌లెంట్‌ రెస్పాన్స్‌ వచ్చింది. రైతులు, లాయర్లు ఎంతోమంది ఈ సినిమా చూసి మంచి సినిమా తీశారు అని అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఇకనుండి మా బేనర్‌లో కమర్షియల్‌తో పాటు మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలే వస్తాయి. సాయికుమార్‌, శివప్రసాద్‌, సప్తగిరి ప్రాణం పెట్టి సినిమాలో నటించారు. ఫస్ట్‌టైమ్‌ ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించాను. ప్రతి ఒక్కరూ చాలా నేచురల్‌గా నటించారు. క్యారెక్టర్‌కి తగినట్లు సూపర్‌గా పెర్‌ఫార్మ్‌ చేశారు అని అభినందిస్తున్నారు. డాక్టర్‌గా కంటే నటించడం చాలా కష్టం అని తెల్సింది. సప్తగిరి ఎల్‌.ఎల్‌.బిలాంటి మంచి చిత్రాన్ని నిర్మించినందుకు చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

బి.ఎ.రాజుగారు మాట్లాడుతూ - ''సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' సక్సెస్‌ అయ్యింది. సూపర్‌హిట్‌కి వెళ్ళబోతోంది. ఈ క్రెడిట్‌ అంతా ప్రేక్షకులతో పాటు మీడియాకి చెందుతుంది. ఒక మంచి సినిమా తీస్తే దానికి మావంతు సహకారం అందిస్తామని ఈ సినిమాతో ప్రూవ్‌ చేశారు. సినిమా గురించి, క్లైమాక్స్‌ గురించి పదిమందికి చెప్పి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. ఈ చిత్రంలో సప్తగిరి విశ్వరూపం చూపించాడు. సాయికుమార్‌ పక్కన యాక్ట్‌ చేయడం మామూలు విషయం కాదు. ఒక సింహంతో ఢీకొన్నట్లే. సాయిగారు శివాజీ గణేష్‌లా రెచ్చిపోయినా కూడా తనకి పోటాపోటీగా నటించి అందరూ స్టన్‌ అయ్యేలా చేశాడు సప్తగిరి. ప్రతి ఒక్కరూ సప్తగిరిలో ఇంత టాలెంట్‌ వుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంటర్వెల్‌ సీన్స్‌లో బైక్‌ మీద చేతులు వదిలేసి వెళ్లే సీన్‌కి ఆడియన్స్‌ ఎంత విజిల్స్‌ కొట్టారో.. క్లైమాక్స్‌లో సాయికుమార్‌గారిని ఢీకొట్టే సన్నివేశానికి అంతే క్లాప్స్‌ పడుతున్నాయి. ఈ సినిమాతో ఆర్టిస్ట్‌గానే కాకుండా హీరోగా సప్తగిరి ఎంతో ఎదిగాడు. చరణ్‌లో మంచి డైరెక్టర్‌ వున్నాడని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. పరుచూరి బ్రదర్స్‌ ప్రాణం పెట్టి డైలాగ్స్‌ రాశారు. డబ్బు కోసం కాకుండా మనవాడు నిలబడాలని అని వారి శిష్యుడు చరణ్‌ కోసం అద్భుతంగా డైలాగ్స్‌ రాశారు. పెర్‌ఫార్మెన్స్‌తో పాటు డ్యాన్స్‌, ఫైట్స్‌ చాలా కష్టపడి చేశాడు సప్తగిరి. సినిమా అంతా నేచురల్‌గా వుంటుంది. అందుకే ఇంత పెద్ద హిట్‌ అయ్యింది. ఈ సినిమా హిట్‌కి మెయిన్‌ కారణం మా ప్రొడ్యూసర్‌ రవికిరణ్‌గారు. ఆయన డాక్టర్‌గా, యాక్టర్‌గా కూడా ఈ సినిమాతో సక్సెస్‌ అయ్యారు. ముందు ముందు ఆయన సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్‌ చేస్తూ త్వరలో మరో సినిమాలో హ్యాట్రిక్‌ కొట్టాలని కోరుకుంటున్నాను. సీరియస్‌గా వెళ్ళే సినిమాలో హీరోయిన్‌ కశిష్‌ వోరా తన గ్లామర్‌, పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌కి రిలీఫ్‌ ఇచ్చింది. సాంగ్స్‌ అన్నీ సినిమాకి ఎంతో ప్లస్‌ అయ్యాయి. యూనిట్‌ అందరికీ కంగ్రాట్స్‌. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు వందనం'' అన్నారు.

హీరోయిన్‌ కౌశిష్‌ వోరా మాట్లాడుతూ - ''థియేటర్‌లో సినిమా చూశాను. ఆడియన్స్‌ అందరూ సినిమాని బాగా రిసీవ్‌ చేసుకున్నారు. చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ టీమ్‌తో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. ప్రతి ఒక్కరూ హార్డ్‌వర్క్‌ చేశారు. సినిమా సక్సెస్‌ అయినందుకు చాలా సంతృప్తిగా వుంది. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

 

Facebook Comments
Saptagiri LLB proved again good content will always be appreciated: Producer Dr.Ravi Kiran

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: