Social News XYZ     

“Kathalo Rajakumari” Release Date Pushed to July

జూలై నెలాఖరున "కథలో రాజకుమారి"

"Kathalo Rajakumari" Release Date Pushed to July

Actor Nara Rohith in Kathalo Rajakumari Movie Stills

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ, హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న యంగ్‌ హీరో నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి". శిరువూరి రాజేష్‌వర్మ సమర్పణలో మాగ్నస్‌ సినీప్రైమ్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సౌందర్య నర్రా, ప్రశాంతి , శుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

నాగశౌర్య మరో కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నమిత ప్రమోద్, నందితలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్‌ సూరపనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్ లు సంగీత సారధ్యం వహించిన పాటలు ఇటీవల ఆన్ లైన్ ద్వారా విడుదల చేయగా శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించింది. అదే విధంగా.. టీజర్-ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకొంది. తొలుత ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేసినప్పటికీ.. సినిమా అందరికీ చేరువవ్వాలన్న ఆలోచనతో.. "కథలో రాజకుమారి" చిత్రాన్ని జూలై నెలాఖరుకు విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "పరిణతి చెందిన ఓ జంట మధ్య జరిగే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథా చిత్రం 'కథలో రాజకుమారి'. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన మా చిత్రాన్ని జూన్ లో విడుదల చేద్దామనుకొన్నాం. కానీ.. జూలై నెలాఖరుకు విడుదలను వాయిదా వేయడం జరిగింది. సినిమా ఎక్కువమంది జనాలకు చేరాలన్న ఆలోచనతోనే సినిమాను జూలై నెలాఖరుకు వాయిదా వేయడం జరిగింది" అన్నారు.

Facebook Comments
"Kathalo Rajakumari" Release Date Pushed to July

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: