Social News XYZ     

Pelli Katha movie launched at filmnagar Daiva Sannidhanam

దైవ సన్నిధలో ప్రారంభమైన "పెళ్లి కథ"

Pelli Katha movie launched at filmnagar Daiva Sannidhanam

శ్రీ రామాంజనేయ ఇంటర్నేషనల్ మూవీ కార్పరేషన్ పతాకం పై అని శైని ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పెళ్లి కథ’. నూతన నటీనటులు మనోహర్, తేజారెడ్డి జంటగా జి.యన్.మూర్తి (గునిశెట్టి)దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వడ్డి రామాంజనేయులు, కారెం వినయ్ ప్రకాష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని దైవ సన్నిదలో లాంఛనంగా పెళ్లికథ ప్రారంభమైంది.

 

ఫిబ్రవరి 10 నుంచి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని నిర్మాతలు తెలిపారు. పెళ్లి నేపథ్యంలో ఇంతవరకు ఎవకు టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమా రూపొందనుందని, ప్రేమతో పాటు కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ, ఇప్పటి ట్రెండ్ కి, యూత్ కి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన ప్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశాలు ఉండబోతున్నాయని దర్శకుడు తెలిపారు.

ప్రేమ, కుటంబ కథా చిత్రంగా రానున్న ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు కథ, స్ర్కీన్ ప్లేను జి.యన్.మూర్తి(గునిశెట్టి) అందించారు. అలానే ఈ పెళ్లి కథకు సంగీతం- యమ్.యమ్.కుమార్, డి.ఓ.పి- కళ్యాణ్ శ్యామ్ ఎడిటింగ్-సత్య గిడుతూరి, కో డైరెక్టర్-నాగ్ అద్దంకి, మాటలు-ఏకే జంపన్న, పాటలు- పుండరీ కాక్ష, సాయిశ్రీసిరి.

Facebook Comments
Pelli Katha movie launched at filmnagar Daiva Sannidhanam

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.