Social News XYZ     

Telangana State Film Chamber of Commerce completes 75 years

తెలంగాణా స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ డైమండ్ జూబ్లీ (75 సంవత్సరాలు) పూర్తి అయిన సందర్భంగా

ది హైదరాబాద్ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ 17 నవంబర్ 1941 లో స్థాపించటం జరిగినది. ఇది ఈ నవంబర్ 17 కు (నేటికి) 75 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్బంగా కమిటీ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగినది. ఇది దక్షిణ భారత దేశములోనే ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రధమ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్. దీనిని 2014 సంవత్సరంలో తెలంగాణా స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ గా మార్చడం జరిగినది. ఈ సంస్థని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించాయి. ఈ సంస్థ లో నేటికి 3382 మంది సభ్యులు గలరు.. వారిలో 2600 మంది నిర్మాతలు, 203 మంది డిస్ట్రిబ్యూటర్లు, 468 మంది థియేటర్ యాజమానులు మరియు ఇతర సభ్యులు 111 మంది సభ్యులుగా గలరు. ఈ సంస్థ 75 సంవత్సరముల డైమండ్ జూబ్లీ సందర్భంగా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పి. రామ్మోహనరావు గారు మరియు సెక్రటరీ కె. మురళీమోహనరావు గారు మాట్లాడుతూ తెలంగాణా స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అనేది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల చే అధికారికంగా ధ్రువీకరించిన ఏకైక సంస్థ. ఈ సంస్థ తో పాటు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన ఏ ఇతర సంస్థ లోనైనా సభ్యులుగా చేరి ఆ సంస్థల నుంచే నిర్మాతలు తమ చిత్రాల కు సంబంధించి బ్యానర్ రిజిస్ట్రేషన్లు, టైటిల్ నమోదు మరియు పబ్లిసిటీ క్లియరెన్స్ లు పొందాల్సి ఉంటుందని, సెన్సార్ కు సంబంధించిన అనుమతి పత్రములు తీసుకోవలసి ఉంటుందని, అలాగే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు అందించే సేవలు పొందవలెనన్నా, ప్రభుత్వం నుండి లభించే ఏ లబ్ధి పొందవలెనన్నా ప్రభుత్వం గుర్తించిన సంస్థ లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఆ ప్రయోజనాలు వర్తిస్తాయని తెలియజేసినారు. వారు మాట్లాడుతూ తెలంగాణా పేరిట కోకొల్లలు గా ఏర్పడిన భోగస్ సంస్థల కు దేనికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు లేదని, వారి వలలో పడి మాయమాటలు విని డబ్బులు కట్టి సభ్యత్వాలు తీసుకుని వారి సమయమును మరియు డబ్బును వృధా చేసుకొనరాదని తెలియపరిచినారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా పెద్ద యెత్తున నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. దానికి సంబంధించిన విషయములు త్వరలో తెలియజేస్తామని చెప్పినారు. ఈ సంస్థ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ కి మరియు ప్రభుత్వ సలహాదారుడు శ్రీ కె.వి.రమణాచారి గారికి, శ్రీ నవీన్ మిట్టల్ గారికి విన్నవించిన కొన్ని విన్నపాలను ఈ సందర్భంగా తెలియజేసినారు.

  1. ప్రతీ థియేటర్ లో చిన్న చిత్రాల కొరకు ఐదవ ఆట ప్రదర్శన...
  2. అన్ని థియేటర్ లలో టికెట్లను ఆన్ లైన్ పద్దతి ద్వారా విక్రయించాలని, మరియు రాష్ట్రమంతటా టికెట్ టాక్స్ విధానం విధించాలని...
  3. థియేటర్ మెయిన్ టనన్స్ చార్జీ లను పెంచవలెనని...
  4. కరెంటు టారిఫ్ ను ఇండస్ట్రియల్ టారిఫ్ క్రిందకు తీసుకురావాలని...
  5. షూటింగ్ పర్మిషన్లు మరియు క్రొత్త థియేటర్ ల నిర్మాణానికి అనుమతులు సింగిల్ విండో పద్దతిని తీసుకురావాలని...
    త్వరలోనే దీనికి సంబంధించి సానుకూల నిర్ణయాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు.
    ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు మన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు గారు, మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ గారు మరియు ప్రభుత్వ సబ్ కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని కార్యవర్గ సభ్యులు ఘనంగా కొనియాడారు.
Facebook Comments
Telangana State Film Chamber of Commerce completes 75 years

About Raju Sagi

 

%d bloggers like this: