Social News XYZ     

Ekkadiki Pothavu Chinnavada Audio on November 11th

న‌వంబ‌ర్ 11న  'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'  ఆడియో విడుద‌ల‌

Ekkadiki Pothavu Chinnavada Audio on November 11th

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో ఢిఫరెంట్ స్క్నీన్‌ప్లేతో   సూప‌ర్‌హిట్ చిత్రాలు అందించిన‌  యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్  నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'.  ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా  21F ఫేం హెబాప‌టేల్ మ‌రియు త‌మిళం లో 'అట్ట‌క‌త్తి', 'ముందాసిప‌త్తి', 'ఎధిర్ నీచ‌ల్' లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్ లో నిటించిన నందిత‌ స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇలాంటి క్రేజి ప్రోజెక్ట్ ని  'టైగ‌ర్' ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు.  మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరి ని తెర‌కెక్కిస్తున్నారు. ఈచిత్రానికి సంబందించిన ఆడియోని న‌వంబ‌ర్ 11న డైర‌క్ట్ గా మార్కెట్ లోకి విడుద‌ల చేస్తున్నారు. న‌వంబ‌ర్ 13న ఆడియో సెల‌బ్రేష‌న్స్ చేసి చిత్రాన్ని న‌వంబ‌ర్ 18న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంధర్బం గా  హీరో నిఖిల్ మాట్లాడుతూ " మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఏక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రాన్ని చేశాము.  మా టీజ‌ర్ ని చూసిని ప్ర‌తి ఓక్క‌రూ చాలా ఇంట్ర‌స్టింగ్ గా వుంద‌ని చెప్తున్నారు. అలాగే మా సాంగ్స్ విన్న‌వాళ్ళంతా చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు. మార్కెట్ లోకి డైర‌క్ట్ గా విడుద‌ల చేశాము. ఆదిత్యా ద్వారా ఆన్‌లైన్ లో కూడా విన‌చ్చు.. మా చిత్రం కూడా మంచి  ఇంట్రెస్ట్ ని క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు/ఏ స‌ర్టిఫికేట్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 18న విడుద‌ల అవుతుంది.  శేఖ‌ర్ చంద్ర అందించిన ఆడియో సెల‌బ్రేష‌న్స్ న‌వంబ‌ర్ 13న చేస్తున్నాము. ఈ చిత్రం ట్విస్ట్ ల‌తో ఆద్యంతం న‌వ్వించ‌మే కాకుండా సూపర్ థ్రిల్ క‌లిగిస్తుంది. హెబాప‌టేల్ , నందితా శ్వేత ఎక్స‌లెంట్ గా చేశారు. ఇంకా వెన్నెల కిషోర్ చాలా బాగా న‌వ్వించాడు. నా గ‌త చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. గెట్ రెడి టు థ్రిల్" అని అన్నారు.

 

ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడూతూ" ఎక్క‌డికి పోతావు చిన్నివాడా చిత్రానికి సంభందించి ప్ర‌తి విష‌యాన్ని మీడియా వారు చాలా పాజిటివ్ గా  ప్రేక్ష‌కుల వ‌ద్ద‌కు తీసుకువెళ్ళారు. మా సాంగ్స్‌ ని మార్కెట్ లోకి డైరెక్ట్ గా విడుద‌ల‌ చేశాము. ఆడియో సెల‌బ్రేష‌న్ ని న‌వంబ‌ర్ 13న చేస్తున్నాము. న‌వంబ‌ర్ 18 న విడుదల చేస్తున్నాము. " అని అన్నారు.

నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్, భ‌ద్ర‌మ్‌, అపూర్వ శ్రీనివాస్ మెద‌ల‌గు వారు న‌టించ‌గా..

పాట‌ల- రామ‌జోగ‌య్య శాస్ట్రి, శ్రీమ‌ణి,

ఆర్ట్‌- రామాంజ‌నేయులు,

ఎడిట‌ర్- చోటా.కె.ప్ర‌సాద్‌,

సంగీతం-శేఖ‌ర్ చంద్ర‌,

మాట‌లు- అబ్బూరి ర‌వి

పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశీను

డి.ఓ.పి- సాయి శ్రీరామ్‌,

నిర్మాత‌- మేఘ‌న ఆర్ట్స్‌

స్టోరి, స్క్రీన్‌ప్లే,డైర‌క్ట‌ర్‌- వి.ఐ.ఆనంద్‌,

Facebook Comments

%d bloggers like this: