Social News XYZ     

We achieved success with that one word from Ilayaraja sir.. Hero Taksh at the success meet of ‘A Beautiful Breakup’

ఇళయరాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం.. - ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్


తక్ష్, మటిల్డా హీరోహీరోయిన్లుగా నటించిన ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’. అజిత్ వాసన్ ఉగ్గిన రచన, దర్శకత్వంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా రూపొంది, ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని 5 నేచర్స్ మూవీస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతంలో ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణరావు సమర్పించిన ఈ చిత్రం, విడుదలైన అన్ని చోట్ల ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని, సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తమ సంతోషాన్ని తెలిపేందుకు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఇంగ్లీష్ భాషలో విడుదలైన ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ఈ కార్యక్రమంలో తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన మాట్లాడుతూ.. ‘‘మా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రేమ అనేది యూనివర్సన్. దీనికి ఎటువంటి కల్చర్ ఉండదు. పెయిన్ ఉంటుంది. మరి అలాంటి ప్రేమ కథా చిత్రాన్ని ఒక్క భాషలోనే ఎందుకు చేయాలి? ముందు ఇంగ్లీష్ భాషలో చేద్దామని ఫిక్సయ్యాం. రెండు పాత్రలతోనే చేద్దామని అన్నప్పుడు తక్ష్ ముందు భయపడ్డారు. ఎంతోమందిని పెట్టి, ఫైట్స్, డ్యాన్స్‌లు ఉన్నా సినిమాలు సక్సెస్ కావడం లేదు, రెండు పాత్రలతో అంటే.. అని డౌట్‌ వ్యక్తం చేశాడు. నీకెందుకు నేను చూసుకుంటాను అని.. ఇంగ్లీష్‌లో మొదట స్టార్ట్ చేశాం. ఇంగ్లీష్‌లో సినిమా చేయడమే కాదు, ఇళయరాజాగారి హిస్టరీలో కూడా నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. తక్ష్ నన్ను ఎంతగానో నమ్మాడు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ప్రతి విషయంలో నాకు ఆయన సపోర్ట్ చేశారు. హీరోహీరోయిన్లు తక్ష్, మటిల్డా సినిమా మొత్తాన్ని ఎంతో బాధ్యతగా తమ భుజాలపై మోశారు. ఇద్దరూ కొత్తవాళ్లే కానీ, హాలీవుడ్ రేంజ్‌లో వారు నటించి, వారి ప్రతిభను చాటుకున్నారు. వాళ్లకు మంచి భవిష్యత్ ఉంది. ఇప్పటి వరకు ఒక్కరు కూడా నెగిటివ్‌గా మాట్లాడలేదంటే, అంత నేచురల్‌గా వారిద్దరూ కథలో లీనమయ్యారు. నిజమైన కపుల్ ఎలా ఉంటారో అలా ఇద్దరూ వారి ప్రతిభను ప్రదర్శించారు. వారికి, ఈ సందర్భంగా నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అని అన్నారు.

 

చిత్ర హీరో తక్ష్ మాట్లాడుతూ.. ముందుగా మీడియాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మొదటి నుంచి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ వేడుకకు మా హీరోయిన్ రావాల్సి ఉంది. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నిమిత్తం ఆమె విదేశాల్లో ఉంది. రాలేకపోయినందుకు ఆమె సారీ చెప్పారు. త్వరలోనే అందరితో మరో ప్రెస్ మీట్ చాలా పెద్దగా నిర్వహిస్తాం. ఈ వేడుకకు గెస్ట్‌గా వచ్చిన సంజయ్ గారికి థ్యాంక్స్. సినిమా విషయానికి వస్తే.. ముందు ఈ కథని చాలా చిన్నదిగా స్టార్ట్ చేశాం. దర్శకుడు పూర్తి స్థాయి కథ రెడీ చేసిన తర్వాత మైండ్ బ్లోయింగ్. ఇళయరాజాగారే స్టన్ అయ్యారు. ఇది ఛాలెంజింగ్ ప్రాజెక్ట్.. నేను ఇంత వరకు ఇలాంటి సబ్జెక్ట్ చేయలేదని అన్నారంటే.. కథలో ఉన్న డెప్త్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూస్తే అదేంటో అర్థమవుతుంది. రాజా సార్ చెప్పిన ఆ ఒక్క మాటతోనే మేము సక్సెస్ కొట్టేశాం. ఒక బాటిల్‌లో బంధించిన ఆత్మలతో దర్శకుడు ఒక ట్రూ స్టోరీని నడిపారు. ఇలాంటి స్టోరీ ఇప్పటి వరకు ఎక్కడా చూసి ఉండరు. రెండు పాత్రలతో దర్శకుడు ఈ సినిమా చేయడం నిజంగా ఓ అద్భుతం. దర్శకుడు అజిత్ చిన్న పాయింట్‌తో స్టోరీని ఎంతో అద్భుతంగా రెడీ చేశారు. అందుకే అందరూ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్వరలోనే అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమాను చూపించనున్నాం. రాజా సార్ ఇచ్చిన మ్యూజిక్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక సినిమాను మ్యూజిక్‌తో ఎంత వరకు తీసుకెళ్లవచ్చో.. రాజా సార్ ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. మ్యూజిక్‌ని బేస్ చేసుకుని, త్వరలోనే చెన్నైలో ఒక బిగ్గర్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. రెండు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. కానీ రాజా సార్ మాకు చాలా సులువు చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా అన్ని సాంకేతిక విభాగాల్లో టాలెంటెడ్ టెక్నీషియన్స్ పని చేశారు. అందుకే ప్రపంచం మొత్తానికి ఈ సినిమాను చూపించాలని అనుకుంటున్నాం.

గెస్ట్‌గా వచ్చిన బలగం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా టైటిల్, క్యాప్షన్ నాకు బాగా నచ్చాయి. ఈ టీమ్ వాళ్లంతా నాకు బాగా కావాల్సిన వాళ్లు. ఈ సినిమా రిపోర్ట్స్ విన్నాను. చాలా మంచి స్పందన వస్తున్నందుకు టీమ్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇళయరాజా సార్ ఈ సినిమాకు వర్క్ చేయడమనేది పెద్ద ఎస్సెట్. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రానున్న ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.

తక్ష్, మటిల్డా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: గుణశేఖరన్
ఎడిటింగ్: శ్రీకాంత్
సౌండ్ డిజైన్: రాజన్
నిర్మాణం: 5 నేచర్స్ మూవీస్ ఇంటర్నేషనల్
సమర్పణ: ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణరావు
పీఆర్వో: బి. వీరబాబు
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
కథ, దర్శకత్వం: అజిత్ వాసన్ ఉగ్గిన

We achieved success with that one word from Ilayaraja sir.. Hero Taksh at the success meet of 'A Beautiful Breakup'

Facebook Comments
We achieved success with that one word from Ilayaraja sir.. Hero Taksh at the success meet of 'A Beautiful Breakup'

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.