బావోలి ఆర్ట్ సంగంలో చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి - భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు తనవంతు కృషి
భారతదేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో అల్లు స్నేహారెడ్డి కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆమె కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
ఫ్యాషన్, కళలు, సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి కలిగిన అల్లు స్నేహారెడ్డి ఈ కార్యక్రమంలో భాగం కావడం విశేషం. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
భారతదేశంలోని చారిత్రక మెట్ల బావుల (స్టెప్‌వెల్స్) విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు, వాటి అద్భుతమైన నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యత, నీరు, కళలు, నాగరికత మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు స్నేహారెడ్డి భాగస్వామ్యం భారతీయ కళా వారసత్వంపై మరింత అవగాహన పెంచడంతో పాటు, మన సంస్కృతి మూలాలను గౌరవించేలా ప్రజలను ప్రోత్సహించనుంది.
బావోలి ఆర్ట్ సంగం 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10 వరకు జరగనుంది. ఈ వేడుకలో భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.


