Social News XYZ     

Aarna Muler about her film industry journey

పెద్ద కలల వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న ఆర్నా ములర్

హైదరాబాద్‌కు చెందిన తెలుగు నటి ఆర్నా ములర్, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పాత్ర ఏదైనా, అందులో సహజత్వాన్ని చూపిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఇటీవల విడుదలైన ‘అగాధ’ చిత్రంలో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్నా, అంతకుముందు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, ‘రజాకార్’, ‘దక్షిణ’ వంటి చిత్రాల్లోనూ నటించారు.
ప్రస్తుతం ‘మా ఊరి మల్లన్న’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తండ్రి–కూతురు మధ్య ఉన్న అనుబంధం, భావోద్వేగాలను ప్రధానంగా చూపించే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆర్నా పోషించిన పాత్ర కథలో కీలకంగా ఉండనుంది.

 

తెలుగు చిత్రాలతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టిన ఆర్నా, తన తొలి కన్నడ చిత్రానికి గాను ఇటీవల బెంగళూరులో జరిగిన చిత్ర సంతే ఫిల్మ్ అవార్డ్స్‌లో గుర్తింపు అందుకున్నారు.
నటనపై ఉన్న ఆసక్తి, కష్టపడే తత్వంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆర్నా ములర్, మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

“పెద్ద కలలు ఒక్కరోజులో నిజం కావు… ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగితే తప్పకుండా గమ్యం చేరుకోవచ్చు” అనే నమ్మకంతో ఆర్నా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Facebook Comments
Aarna Muler about her film industry journey

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.