Social News XYZ     

Tarun Bhaskar’s ‘Rupayanama’ first look released. The film will release on October 2nd

తరుణ్ భాస్కర్ చేతులమీదుగా ‘రూపాయనమ:’ ఫస్ట్ లుక్ విడుదల. అక్టోబర్ 2న సినిమా విడుదల

చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పావని సాగి నిర్మాణంలో అరవింద్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రూపాయనమ:’. ఈ సినిమాలో అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి ప్రధాన పాత్రలను పోషించారు. కోటి రూపాయల లాటరీ నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఫ్యామిలీ, కామెడీ అంశాలతో పాటుగా థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాల్ని కూడా జోడించారు. ఈ మూవీని అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. రెండు గంటల 13 నిమిషాల నిడివితో ఈ మూవీ రానుంది.

‘రూపాయనమ:’ సినిమాకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ, సస్పెన్స్, హ్యూమర్ ఇలా అన్ని అంశాలను జోడించిన ఈ సినిమాని అందంగా మలిచారని సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి.

 

ఈ చిత్రం మొదటి పోస్టర్ మరియు టైటిల్ సాంగ్ ను దర్శకులు తరుణ్ భాస్కర్ విడుదల చేసారు. సోషల్ మీడియా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మున్ముందు ప్రమోషనల్ కంటెంట్‌ను వదిలి చిత్రంపై అంచనాల్ని పెంచనున్నారు.

ఈ సినిమాకి రిషి.ఎం మ్యూజిక్ డైరెక్టర్‌గా, జింక వరుణ్ నాయుడు కెమెరామెన్‌‌గా పని చేశారు. ఈ మూవీకి ఎడిటర్‌గా రవితేజ గిరిజాల వర్క్ చేస్తున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి, తదితరులు

బ్యానర్ : చిత్రవేద ప్రొడక్షన్స్
నిర్మాత :పావని సాగి
రచయిత, దర్శకుడు : అరవింద్ రెడ్డి
కెమెరామెన్ : జింక వరుణ్ నాయుడు
ఎడిటర్ : రవితేజ గిరిజాల
మ్యూజిక్ డైరెక్టర్ : రిషి.ఎం

Facebook Comments
Tarun Bhaskar's 'Rupayanama' first look released. The film will release on October 2nd

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.