Social News XYZ     

‘Pithapuramlo… Ala Modalaindi’ to be released on September 18th by Prime Show Entertainment

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.

డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్ మరియు ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు.

 

ప్రేమ, సునిశితమైన హాస్యం, సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి భావోద్వేగ అంశాలతో పాటు యువతకు ఒక మంచి సందేశాన్ని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు. మన చుట్టూ కనిపించే సహజమైన పాత్రలు, సంఘటనలతో సినిమా ఎంతో సహజంగా ఉంటుందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని ఆయన అన్నారు.

హాస్య బ్రహ్మ డా. బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని, ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఇందులో కీలక పాత్రలో నటించారని, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని, నిజంగా కెమెరా పెట్టి లైవ్ చేసినట్టుగా ఈ సినిమా ఉంటుందని, ఇలాంటి కాన్సెప్టులు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అని మహేష్ చంద్ర తెలిపారు. ఇరుముడి, విశ్వనాథం అండ్ సన్స్, మా ఇంటి బంగారం తరహా లోనే మా సినిమా కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అవుతుందని మహేష్ చంద్ర చెప్పారు.

డా. రాజేంద్రప్రసాద్, పృధ్విరాజ్ ,కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K A పాల్ రాము, జబర్దస్త్ శేషు ఇందులో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి స్టోరీ డెవలప్మెంట్ & డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: B. సత్యనారాయణ, మ్యూజిక్ : G.C క్రిష్, నిర్మాతలు: దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, FM మురళీ (గోదారి కిట్టయ్య), స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మహేష్ చంద్ర.

Facebook Comments
‘Pithapuramlo… Ala Modalaindi’ to be released on September 18th by Prime Show Entertainment

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.