"ఆలోచన" చిత్రం టీజర్ ను విడుదల చేసిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ !!!
పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం "ఆలోచన".
సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను పద్మశ్రీ మురళి మోహన్ గారు విడుదల చేశారు. తాజాగా "ఆలోచన" టీజర్ ను ప్రముఖ రచయిత విజయేoద్ర ప్రసాద్ గారు విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ... "ఆలోచన" టీజర్ బాగుంది. ఫ్రేమింగ్, మ్యూజిక్ , పెర్ఫార్మెన్స్, వారి కాన్సెప్ట్ చాలా బాగుంది, వాస్తవ సంఘటనలను తీసుకొని చేసిన ఈ సినిమా అద్భుతమైన నటుల కాంబినేషన్ తో స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్ తో "ఆలోచన" చేశారని మంచి సంకల్పం తో నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన సినిమాను నిర్మించారు అని ప్రశంసించారు. ఈ చిత్రానికి సాంకేతిక వర్గం కెమెరా: టి. సురేంద్ర రెడ్డి, సంగీతం: వియాన్ , పాటలు: ప్రతాప్ రాజులపల్లి, ఎడిటర్: ఆర్.ఎల్.వర్మ, ఆర్ట్: గిరీష్ దేవాంగ్, ఈ.పి: సీ.హెచ్.విజయ్ కుమార్.
మంచి కథాబలం ఉన్న "ఆలోచన" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఈ సినిమా విజయం సాధించి, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు" తెలిపారు.
షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "ఆలోచన" చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, ఈ సినిమాకు సంబంధించిన సాంగ్, ట్రైలర్ త్వరలో విడుదల కానుంది .
TEASER: https://youtu.be/29jQoaMDznI
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.