శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, లయ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. బ్లూ.J క్రియేషన్స్ బ్యానర్ పై GK, చందు నిర్మాణంలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా జులై 17న రిలీజ్ అయ్యింది, సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.
కథ :
వెంకటరమణ(శ్రీకాంత్) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. వేంకటేశ్వరస్వామికి వీర భక్తుడు. తన భార్య పద్మావతి(లయ), తండ్రి ఏడుకొండలు(మురళి గాడ్), చెల్లి(కరుణ), బావ(భూపాల్), పిల్లలతో కలిసి ఉంటాడు. వీళ్లంతా ఓ హోటల్ నడిపిస్తూ అది బాగా సాగినా అత్యాశకు పోయి అప్పు చేసి మరీ రెస్టారెంట్ పెట్టి లాస్ అవుతారు. ఆ తరువాత వేంకటేశ్వరస్వామి వచ్చి వెంకటరమణ కు ఓ బుక్ ఇచ్చి అందులో ఏం రాస్తే అదే జరుగుగుతుంది అని కొన్ని కండిషన్స్ పెడతాడు. అసలు ఆ బుక్ ఏంటి? ఆ బుక్ కి ఉన్న కండిషన్స్ ఏంటి? ఆ బుక్ తో వెంకటరమణ కష్టాలు తీరాయా? ఆ బుక్ లో వెంకటరమణ ఏం రాసాడు? ఆ బుక్ ఎవరెవరి చేతుల్లోకి మారి అందులో ఏమి రాశారు? ఆ బుక్ తో వెంకటరమణ, అతని కుటుంబం జీవితం ఎలా మారింది? వేంకటేశ్వరస్వామి మళ్ళీ కనిపిస్తాడా.. ఇది మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా ప్రధాన కథంశం.
విశ్లేషణ :
మిస్టర్ మిడిల్ క్లాస్ మంచి స్టోరీ లైన్. శ్రీకాంత్, లయ, రాజేంద్రప్రసాద్ ముగ్గురూ కూడా కథలో విషయం వుంటే ఎమోషనల్‌గా మోయగల సమర్థులు. వీళ్లకి అదనంగా సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ, పృధ్వీ, ప్రభాస్ శీను ఉన్నారు. అయితే ఫీల్ గుడ్ కామెడీని , గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు నాగేశ్వరరెడ్డి ప్రేక్షకులను అలరించాడు.
శ్రీకాంత్, లయ భార్య భర్తలుగా అద్భుతంగా నటించారు, వెంకటేశ్వర స్వామి పాత్రలో రాజేంద్రప్రసాద్ సూపర్ గా చేశారు, రఘుబాబు, సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు అదనపు ఆకర్షణ. యముని పాత్రలో ధనరాజ్ ప్రేక్షకులను అలరించాడు.
నాగేశ్వరరెడ్డి ఎమోషనల్‌గా, కామెడీగా సినిమాను నడిపించిన విధానం చాలా బాగుంది, సాయి కార్తీక్ సంగీతం సినిమాకు మరో పెద్ద హైలెట్.
అదే విధంగా దేవుడే స్వయంగా వచ్చి ఒంటిమీద నగలన్నీ ఇచ్చినా, ఒక మధ్య తరగతి వాడు, ఈ వ్యవస్థలో అమ్ముకోలేడు. ఈ పాయింట్
చాలా కొత్తగా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది.
సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు సగటు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అవుతాయి. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి, అత్యాశ, డబ్బు చుట్టూ తిరిగే సీన్స్ బాగా అల్లుకున్నారు దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి, ఒక మంచి సందేశంతో పాటు వినోదన్ని పంచిన ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ అందరికి నచ్చుతాడు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమా ఇది.
చివరిగా : మిస్టర్ మిడిల్ క్లాస్ మెప్పిస్తాడు
రేటింగ్ : 3.5/5
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
