మార్చి 13 నుండి ZEE5 లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్
మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రలు పోషించారు. కావాల్సినంత కామెడీ, గుండెల్ని తాకే ఎమోషన్స్‌ను మిళితం చేసి ఈ కథను కిషోర్ తిరుమల తెరపైకి తీసుకు వచ్చారు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీగా ఉంది. మార్చి 13 నుంచి ఈ మూవీ జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. దక్షిణాది భాషల్లో ఈ మూవీ డబ్బింగ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి
మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ .. ‘ఈ సినిమాలో హాస్యంతో నిండిన ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. కిషోర్ తిరుమల దీనిని వినోదాత్మకంగా, అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించారు. దక్షిణాది ప్రాంతాల ప్రేక్షకులు దీనిని వారి స్వంత భాషలో ఎక్స్‌పీరియెన్స్ చేసేలా జీ5లోకి వస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అని అన్నారు.
ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ .. ‘నా పాత్రతో మహిళలు ఇట్టే కనెక్ట్ అయ్యారు. పలు రకాల షేడ్స్ ఉన్న నా పాత్రని అందరూ ఇష్టపడ్డారు. ఇక ఇప్పుడు మా సినిమా డిజిటల్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఓటీటీలోనూ మా మూవీని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డింపుల్ హయతి మాట్లాడుతూ .. ‘ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటూనే ఎన్నో మంచి విషయాల్ని, సందేశాల్ని ఇస్తుంది. వినోదాత్మకంగా మానవ సంబంధాలను వివరిస్తుంది. ప్రతి పాత్రకు ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ప్రతీ పాత్రకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. జీ5లో కూడా మా సినిమాని ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడదగ్గ ఈ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మార్చి 13న ZEE5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ZEE5 గురించి...
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, లింక్డిన్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో జీ5ని అనుసరించండి.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
