Social News XYZ     

S/O (Son of) Movie… Screenplay Based- Senior actor Vinod Kumar at the S/O “Son of” Movie Teaser Launch Event

S/O(సన్ ఆఫ్) మూవీ... స్క్రీన్ ప్లే బేస్డ్ గా తెరకెక్కింది- S/O "సన్ ఆఫ్" మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు వినోద్ కుమార్

సాయి సింహాద్రి సైన్మా పతాకంపై నిర్మాత సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ... నిర్మించిన చిత్రం "S/O"(సన్ ఆఫ్). బత్తల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం టీజర్ ను శుక్రవారం విడుదల చేశారు.

దర్శకుడు సతీష్ మాట్లాడుతూ... "ఈ చిత్రం వినోద్ కుమార్ గారికి కం బ్యాక్ అవుతుంది. కచ్చితంగా ఆయన ఆల్బమ్ లో ఓ 'మామ గారు' చిత్రం లాగా ఈ సినిమా కూడా ఉండిపోతుంది. నేను చెప్పిన ప్రతి సన్నివేశానికి ఆయన ఒప్పుకుని ఎంతో స్ట్రాంగ్ గా నటించారు. మా హీరో సాయి సింహాద్రి కూడా నన్ను నమ్మి అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. ఆయనకోసం ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. కొడుకు తండ్రి మీద ఎందుకు కేసు వేశాడు అనేది చాలా స్ట్రాంగ్ గా చూపించాం" అన్నారు

 

హీరో సాయి సింహాద్రి మాట్లాడుతూ... " ఎప్పటి నుంచో ఇలాంటి కథను తెరమీద చూపించాలి అని వుంది. ఈ కథ రియల్ లైఫ్ లో నాకూ, మా నాన్నకు కనెక్ట్ అవుతుంది. చాలా కథలు విన్నాను. చివరకు ఈ కథకి కనెక్ట్ అయ్యాను. ఈ కథ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఇందులో డ్రామా, ఎమోషన్ కూడా ఉంటుంది. ప్రతి కొడుకు... తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. ఎంతో నిజాయితీగా సినిమాని తీశాం. దర్శకుడు ఏమి చెప్పారో అదే టీజర్ లో చూపించారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్ ఈ చిత్రానికి ఎంతో వెన్నుదన్నుగా నిలిచి సినిమాని కంప్లీట్ చేశారు. నేను చిరంజీవి గారికి డైహార్ట్ ఫ్యాన్ ని. ఈ సినిమాను ఆయనకి చూపించాలని వుంది" అన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ... '. సన్ ఆఫ్ మూవీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు.. ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. రెగ్యులర్ లైఫ్ లో ఓ తండ్రి, కొడుకుల మధ్య సాగే స్టోరీ ఇది. ఇందులో హీరోగా నటించినసాయి సింహాద్రి... ఎక్కడో పర్లాకిమిడిలో చదివి... అమెరికాకు వెళ్ళి... అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా తీశారు. ఇది గ్రేట్ అచివ్ మెంట్. దర్శకుడు సతీష్ 45 నిమిషాలు స్టోరీ ఎక్స్ట్రార్డినరీ గా నెరేషన్ చేశారు. తన స్టోరీ విని మా అబ్బాయికి కూడా చెప్పాను.... తండ్రి కొడుకుల మధ్య సాగే ఒక మంచి స్టోరీ చెప్పాడని. నేను వందకు పైగా సినిమాలు చేసిన అనుభవంతో చెబుతున్నా... దర్శకుడు జీనియస్.. అతను దర్శకుడు పూరీ జగన్నాథ్ అభిమాని. ఆయన ఎంతో కమిట్ మెంట్ తో ఈ సినిమా చేశారు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నేను ప్రస్తుతం గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. 40 రోజుల పాటు షూటింగ్ చేశా. మారెమ్మ చిత్రంలో నటిస్తున్న. అలాగే సుహాసిని తో కలిసి ఓ సినిమా చేస్తున్నా" అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్రం శీను, రిషి తదితరులు పాల్గొన్నారు.

Cast: Sai Simhadri, Vinod Kumar, Meera Raaj, Vasu Inturi

Writer & Director: Bathala Sateesh

Producer: Sai Simhadri

Cinematography: VRK Naidu

Music Director: Rishi M

Editor: Amarnath

Art Director: Bathula Sahith Kumar

Sound Design: Yathiraj

Lyrics: Bhaskarabhatla, Purnachari, Kasarla Shyam

Choreographer: Raj Pyde

Manager: Ayyappa Baidaru

Lyrical Videos: JK Frames

PRO: Duddi Sreenu

Facebook Comments
S/O (Son of) Movie... Screenplay Based- Senior actor Vinod Kumar at the S/O "Son of" Movie Teaser Launch Event

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.