Social News XYZ     

K Party Fashion Show with Retro Edition Style Theme.. Celebrities Shine

రెట్రో ఎడిషన్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో.. మెరిసిన సెలబ్రిటీలు

హైదరాబాద్; హైదరాబాదులో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్‌‌లతో జరుగుతున్న కె స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తికరంగా జరిగింది.

కె పార్టీ ప్రియులకు తన కొత్త ఆలోచన‌తో లయన్ డాక్టర్ కిరణ్, సుచిరిండియా గ్రూప్ సీఈఓ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బల్గేరియా గౌరవ కన్సల్, తన ప్రతిష్టాత్మక కె పార్టీని రెట్రో ఎడిషన్ స్టైల్లో ఆదివారం రాత్రి ఘనంగా హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ వేడుకలో సెలబ్రిటీలతో గ్రాండ్‌గా ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

 

ఇటువంటి కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తలలో ఉండే డాక్టర్ కిరణ్.. తను ఎందుకు అంత ప్రత్యేకమో మరోసారి ఈ పార్టీతో తెలియజేశారు.ఆయన ఆలోచనలతో జరిగిన సరికొత్త థీమ్ మరియు సర్‌ప్రైజ్‌లు ఈ ఈవెంట్‌ను మరిచిపోలేని ఓ గొప్ప అనుభవంగా మార్చాయి.

కె పార్టీ, మరోసారి హైదరాబాద్‌లో హార్ట్ టాపిక్‌గా నిలిచింది. తన సృజనాత్మకత మరియు వినూత్నతకు ప్రసిద్ధుడైన లయన్ కిరణ్, మరొక విశిష్టమైన మరియు ఉత్సాహభరితమైన థీమ్‌తో వచ్చే సంవత్సరం ఆహ్వానితులను ఎలా ఆకట్టుకుంటారో అనే ఆసక్తి ఇప్పటి నుండే మొదలవడం విశేషం.

Facebook Comments
K Party Fashion Show with Retro Edition Style Theme.. Celebrities Shine

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.