Social News XYZ     

“Forest Man of India” Padma Shri Jadhav Payeng receives rare honor.. Honored with the ‘Sankal Kiran’ award…

"ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా" పద్మశ్రీ జాదవ్ పయెంగ్ అరుదైన గౌరవం.. ‘సంకల్ప కిరణ్’ పురస్కారంతో సన్మానం...

  • మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మరియు సుచిరిండియా ఫౌండేష అధినేత లయన్ డాక్టర్ వై. కిరణ్ చేతుల "ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా" పద్మశ్రీ జాదవ్ పయెంగ్ అరుదైన గౌరవం.. ‘సంకల్ప కిరణ్’ పురస్కారంతో సత్కరించారు.

  • తెలంగాణ వెదర్ మ్యాన్గా పేరొందిన బాలాజీ తరిణి, సామాజిక కార్యకర్త ఖ్వాజా మొయినుద్దీన్, విఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సి. ప్రవీణ్ కుమార్ యాదవ్, కంటెంట్ క్రియేటర్, వీడియో ఎడిటర్ పి.చంద్రశే ఖర్లకు సంకల్పసంజీవని పురస్కారాలను అందజేసి సన్మానించారు.

     

హైదరాబాద్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హైటెక్ సిటీ, శిల్పారామం లోని మౌంటైన్ హైట్స్ లో 'సంకల్ప్ దివాస్' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్ తన బర్త్ డే పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 28న సంకల్ప దివాస్ ను నిర్వహిస్తూ వస్తున్నారు.

లయన్ డాక్టర్ వై. కిరణ్ సమాజ సేవ చేయడంతో పాటు.. సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కరిస్తూ వస్తున్నాడు. గత ఇరవై యేళ్లుగా ప్రతి ఏడాది గొప్ప వాళ్లను సత్కరిస్తూ వస్తున్నాడు. వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరు కావడం తనకు ఎంతో హ్యాపీగా ఉందన్నారు. కిరణ్ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. పద్మశ్రీ జాదవ్ పాయెంగ్ ఆయనకు ప్రకృతి, పర్యావరణం అంటే ప్రాణం.. జీవరాశి మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం 42 ఏళ్లుగా మొక్కలు నాటుతూనే ఉన్నారు. వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని సొంతంగా స్థాపించారు.. అందుకే.. ఆయన్ను ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అని పిలుస్తారు. ఆయన సేవలను గుర్తించిన సుచిరిండియా ఫౌండేషన్.. ‘సంకల్ప కిరణ్’ పురస్కారంతో సత్కరించింది. ఆ పర్యావరణ ప్రేమికుడు ఎవరంటే.. అస్సాంకు చెందిన పద్మశ్రీ జాదవ్ పాయెంగ్.. 1979లో మొదలైన ఆయన సేవలు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 1979లో 16 ఏళ్ల బాలుడిగా రోజుకు ఒక మొక్కను నాటడం మొదలుపెట్టిన జాదవ్ మొలాయ్ పాయెంగ్.. ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందారు. రోజుకి ఒక మొక్క నాటడం లక్ష్యంతో ముందుకుసాగిన ఆయన ఆలోచన.. వన వృక్షాన్నే స్థాపించేలా చేసింది. 42 ఏళ్లుగా కొనసాగించిన ఈ ఉద్యమంతో జాదవ్ ఒంటి చేత్తో 550 హెక్టార్లకు పైగా అడవిని సృష్టించారు.

ఈ ఏడాది 'సంకల్ప్ దివాస్'లో ప్రముఖ సామాజిక వేత "ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా" పద్మశ్రీ జాదవ్ పయెంగ్ ను 'సంకల్ప్ కిరణ్ పురస్కారం'తో గౌరవించారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ వై. కిరణ్ మాట్లాడుతూ.. పద్మశ్రీ జాదవ్ పయెంగ్ ను సత్కరించడం కోసమే.. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వచ్చారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పద్మశ్రీ జాదవ్ పయెంగ్ ని సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రతి ఏడాది ఆనవాయితీగా సంకల్ప్ దివాస్ ని నిర్వహిస్తూ వస్తున్నవిషయాన్ని ప్రస్తావించారు. నా పుట్టినరోజు వేడుకను అర్థవంతంగా, సమాజానికి ఉపయోగపడేలా, కొందరి జీవితాల్లోనైనా వెలుగులు నింపేలా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సంకల్ప్ దివాస్ కి శ్రీకారం చుట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సంకల్ప్ దివాస్ లో ఇప్పుడు రెండు గ్రామాలు, 50 పాఠశాలలు మరియు 3000 మంది స్పెషల్ చిన్నారులతో భాగమైన విషయాన్ని ప్రస్తావించారు. నేను కేవలం 2000 రూపాయిలతో నా జీవితాన్ని ప్రారంభించాను. దేవుడి ఆశీస్సులు, నా తల్లిదండ్రులు నేర్పిన కృషి, పట్టుదలతోనే ఈ రోజు ఎంతో మందికి సేవ చేసే కార్యక్రమం దక్కిందన్నారు. వీరితో పాటు సామాజిక సేవ వారికి సంకల్ప్ సేవా పురస్కార్ తో శ్రీ బాలాజీ తారిణి
తెలంగాణ వెదర్ మ్యాన్,
మిస్టర్ ఖ్వాజా మొయినుద్దీన్
సామాజిక కార్యకర్త & నవాబ్స్ కిచెన్, Mr. C. ప్రవీణ్ కుమార్ యాదవ్ మరియు Mr. పోలిన చంద్ర శేఖర్ వ్యవస్థాపకుడు - వీ అర్ ఫౌండేషన్ సత్కరించారు.

పద్మశ్రీ జాదవ్ పాయెంగ్ మాట్లాడుతూ.. ఈ పురస్కారం పొందటం గౌరవంగా భావిస్తున్నానన్నారు. కిరణ్ చాలా గొప్ప వ్యక్తి. ఆయన చేసే గొప్ప సేవా కార్యక్రమాల గురించి చాలా వింటుంటాను. అలాంటి వ్యక్తితో వేదికను పంచుకోవడం గొప్పగా ఉందన్నారు. నేను కిరణ్ ని కలవకముందే, ఆయన గొప్పతనం గురించి ఎంతో విన్నాను. ఈ ప్రత్యేక పిల్లలు రియల్ హీరోలు. వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకంగా ఉందన్నారు.

Facebook Comments
"Forest Man of India" Padma Shri Jadhav Payeng receives rare honor.. Honored with the 'Sankal Kiran' award...

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.